వంద ఫీట్లలోనే నిర్మించాలి
గతంలో రోడ్డు విస్తరణ కోసం 12గుంటల భూమి కోల్పోయాను. ఇప్పుడు జాతీయ రహదారి కోసం భూమి మధ్యలోంచి వెళ్తుందని చెబుతున్నారు. దీంతో మరో 1.05ఎకరాల భూమి పోతుందని తెలుస్తోంది. రోడ్డు వద్దనడం లేదు. ఉన్న రోడ్డుకు అనుబంధంగా 100ఫీట్ల రోడ్డునే నిర్మించాలి. 150 ఫీట్లు వద్దు. భూమి నష్టపోకుండా జాతీయ రహదారిని నిర్మించాలి.
– రామచంద్రారెడ్డి, దుద్దెడ
భూమి పోతే.. రోడ్డున పడతాం
కష్టం చేసి 2.13 ఎకరాల భూమి కొనుగోలు చేశాను. రోడ్డు పేరుతో రెండు ఎకరాల భూమి పోతుందని తెలిసింది. మిగిలింది 13గుంటలే. అది కూడా అటు సగం.. ఇటు సగం ఉంటుంది. భూమి పోతే మా కుటుంబం రోడ్డున పడుతుంది. నా కూతురు పెళ్లి కోసం అమ్ముదాం అనుకున్నా. ఇప్పుడు భూమి పోతే నా కూతురి పెళ్ల్లి ఎలా చేయాలి. ప్రాణం పోయినా భూమి ఇవ్వను.
–దాసరి యాదగిరి, జప్తినాచారం
మార్కెట్ ధర అమలు చేయాలి
1.03 ఎకరాల భూమి ఉంది. రహదారి కింద దాదాపు 30 గుంటలు పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం మా దగ్గర ఎకరం రూ.80లక్షలకు పోతుంది. మాకు ఎలాంటి సమాచారం లేకుండానే కొలతలు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్ ధర చెల్లించాలి. లేదంటే భూమికి భూమి ఇవ్వాలి. భూమి కోల్పోతే జీవనం కష్టమవుతుంది.
– ఆకుల శ్రీకాంత్, రైతు, ఎన్సాన్‌పల్లి
అప్పుడు మల్లన్నసాగర్..
తొగుట మండలం బ్రాహ్మణ బంజరుపల్లిలో 7ఎకరాల భూమి, ఇల్లు ఉండేది. మల్లన్నసాగర్‌లో భూ మి, ఇల్లు పోయింది. వచ్చిన పరిహారంతో ఎన్సాన్‌పల్లిలో 20 గుంటల వ్యవసాయ భూమిని రూ.30 లక్షలు పెట్టి 2020లో కొనుగోలు చేశాం. ఈ భూమిలో మళ్లీ రోడ్డు కోసం అధికారులు కొలతలు పెడుతున్నారు. ప్రభుత్వం మాకు పూర్తి న్యాయం చేయాలి.
– తోట సుజాత, రైతు, ఎన్సాన్‌పల్లి
ట్రాఫిక్ దృష్ట్యా 150 ఫీట్లకు పెంచాం
హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు వెళ్లే దారిలో ట్రాఫిక్ పెరుగుతుండటంతో 150ఫీట్ల వెడల్పుతో నిర్మించాలని నిర్ణయించాం. పైగా రోడ్డు వంకలు ఉండటంతో కొత్తగా రహదారి నిర్మించనున్నాం. సర్వే కొనసాగుతోంది. ఇది పూర్తి కాగానే రెవెన్యూ ద్వారా నోటీసులు జారీ చేసి నష్టపరిహారం అందజేస్తాం.
– అన్నయ్య, డీఈఈ, జాతీయ రహదారులు
వంద ఫీట్లలోనే నిర్మించాలి
వంద ఫీట్లలోనే నిర్మించాలి
వంద ఫీట్లలోనే నిర్మించాలి
వంద ఫీట్లలోనే నిర్మించాలి
Comments
Please login to add a commentAdd a comment