తెలంగాణపై చిన్నచూపు
గజ్వేల్: తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ ఇన్‌చార్జి, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో గజ్వేల్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వంశీకృష్ణ మాట్లాడుతూ బీజేపీ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ రావాల్సిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలను గుజరాత్‌కు తరలించుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ రెండు కోట్ల ఉద్యోగాల కల్పన కలగానే మిగిలిందన్నారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టభద్రుల ఎన్నికల సమన్వయకర్త గుత్తా అమిత్‌రెడ్డి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి నీలం మధు, కార్పొరేషన్ మాజీ చైర్మన్‌లు భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల
కాంగ్రెస్ ఇన్‌చార్జి ఎమ్మెల్యే వంశీకృష్ణ
గజ్వేల్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం
Comments
Please login to add a commentAdd a comment