చెరువులు, కుంటలు నింపండి
సిద్దిపేటఅర్బన్: జిల్లాలోని చెరువులు, కుంటలను రిజర్వాయర్ల నీటితో నింపి సాగు నీటిని అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్‌లో నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, తాగునీటికి సైతం ఇబ్బందులు లేకుండాచూడాలన్నారు. జిల్లా ప్రజల అవసరాలు తీరిన తర్వాతే ఇతర జిల్లాలకు నీటిని తరలించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలస్వామి, శశిధర్, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు
Comments
Please login to add a commentAdd a comment