
స్వాతంత్య్రోద్యమం కోసమే ఆ పత్రిక
సంగారెడ్డి: స్వాతంత్య్ర సమరాన్ని ఉధృతం చేసేందుకు, ప్రజలను ఉద్యమానికి సమాయత్తం చేసేందుకు పుట్టిన పత్రికే నేషనల్ హెరాల్డ్ అని అటువంటి పత్రికపై విషం గక్కుతున్న బీజేపీని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని టీపీసీసీ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జిషీట్‌లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం సంగారెడ్డి పోస్టాఫీస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలసి ఆయన ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నేషనల్ హెరాల్డ్ పుట్టినప్పుడు నరేంద్రమోదీ, అమిత్‌షా పుట్టనేలేదన్నారు. సోనియా, రాహుల్ గాంధీలది క్షమించే గుణమని, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలది కుట్రల గుణమని చెప్పారు. రాహుల్ గాంధీకి, అమిత్‌షాకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. బీజేపీని అధికారంలోకి తెచ్చిన అద్వానీని ఎందుకు ప్రధానమంత్రిగా చేయలేదో ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు.
సంగారెడ్డి పోస్టాఫీస్ వద్ద ధర్నాలో టీపీసీసీ జగ్గారెడ్డి
సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ
చార్జిషీట్‌లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ...