
కార్డుల్లో పేర్లు గజిబిజి
సాక్షి, సిద్దిపేట: కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు.. దరఖాస్తు చేసిన వారి పేర్లు అమ్మమ్మ, నానమ్మ రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు అయ్యాయి. దీంతో దరఖాస్తు దారులు ఆందోళన చెందుతున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ, పేర్ల నమోదుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ప్రజలు సంతోషించారు. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, సమగ్ర కుటుంబ సర్వేలలో జిల్లా వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం, చేర్పులు కోసం 74,272 మంది దరఖాస్తు చేశారు.
52వేల మంది దరఖాస్తు
ప్రజాపాలన, సమగ్ర కుటుంబ సర్వేలో కొత్త రేషన్ కార్డుల కోసం 52,742, పేర్లు చేర్చుటకు 21,530 మంది దరఖాస్తు చేశారు. వీటి ఆధారంగా ప్రాథమిక స్థాయిలో అర్హులను గుర్తించి వారి జాబితాలను గ్రామ పంచాయతీ, పట్టణాల్లో వార్డు సభలలో ప్రకటించారు. ఈ జాబితాలో పేర్లు ఉన్న వారు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవద్దని అధికారులు చెప్పడంతో నూతన కార్డులు వచ్చినట్లే అని సంతోషపడ్డారు. వీరికి ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఆనందంతో రేషన్ షాప్‌లకు వెళ్తే కొత్త కార్డు రాలేదు.. పిల్లల పేర్లు అమ్మమ్మ, నానమ్మ కార్డులలో నమోదు కావడంతో అయోమయానికి గురవుతున్నారు.
గందరగోళంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ
అమ్మమ్మ, నానమ్మ కార్డుల్లోనే మనవళ్లు, మనవరాళ్ల పేర్లు
కొత్త కార్డుల కోసం
43 వేల మంది దరఖాస్తు
పేర్లు సరి చేయాలని కోరుతున్న దరఖాస్తు దారులు
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి నంగనూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన గాండ్ల రాజు. ప్రజాపాలన, సమగ్ర కుటుంబ సర్వేలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేశారు. తీరా.. రాజు సతీమణి హేమ పేరుతోపాటు కుమారులు గాండ్ల విశాల్, విహాన్ పేర్లు సైతం అత్తంటి వారి కార్డులోనే ఉన్నాయి. అధికారులను అడిగితే మాకు తెలియదని సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులుస్పందించి మా కుటుంబానికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఇలా వీరి ఒక్కరిదే కాదు.. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారిలో పలువురి పరిస్థితి ఇలాగే ఉంది.
విచిత్ర పరిస్థితి
పెళ్లయిన మహిళలు భర్తతో నూతన రేషన్ కార్డు కావాలని తమ చిన్నారులతో సహా దరఖాస్తు చేశారు. అలాగే కొత్త కార్డుల కోసం పెళ్లయిన యువకులు సైతం తమ పేర్లను తల్లిదండ్రుల కార్డుల నుంచి తొలగించుకుని దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరి పేర్లు అత్తగారి రేషన్ కార్డులో తమ చిన్నారులతో సహా నమోదయ్యాయి. ఇలా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో సిబ్బంది చేసిన తప్పా? లేక టెక్నికల్ సమస్యతో ఇలా నమోదు అయ్యాయా? అని ఆందోళన చెందుతున్నారు. మళ్లీ దరఖాస్తు చేసేందుకు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తప్పులను సరి చేసి కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని కోరుతున్నారు.

కార్డుల్లో పేర్లు గజిబిజి

కార్డుల్లో పేర్లు గజిబిజి