ఏబీ డివిలియర్స్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. 14 ఏళ్ల పాటు అభిమానులను అలరించిన ఈ దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్.. వరల్డ్‌క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
ముఖ్యంగా భారత్‌లో అయితే ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులు అతడిని ముద్దుగా 'మిస్టర్ 360' అని పిలుచుకుంటారు. అయితే 2004లో సౌతాఫ్రికా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన డివిలియర్స్.. 2018లో సడన్‌గా ఇంటర్ననేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటిలో అతడి నిర్ణయంతో యావత్తు క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. అయితే తాజాగా తన అకస్మాక నిర్ణయానికి గల కారణాన్ని డివిలియర్స్ వెల్లడించాడు.
"నా చిన్న కొడుకు కాలి మడమ ప్రమాదవశాత్తూ నా ఎడమ కంటికి తాకింది. అందువల్ల నా దృష్టి కాస్త లోపించింది. ఆ తర్వాత సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ అనంతరం డాక్టర్ ఇకపై ఆటకు దూరంగా ఉండమని చెప్పాడు. అందుకే డాక్టర్ సలహా మెరకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాను.
అయితే ఇంటర్ననేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం రెండేళ్ల పాటు ఆడాను. ఆ సమయంలో అదృవశాత్తూ కంటి వల్ల ఎటువంటి సమస్య తలెత్తలేదని" విజ్డెన్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికా తరపున 111 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20ల్లో ఏబీబీ ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లు కలిపి 20014 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment