అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌.. బ్యాటింగ్‌ భారత్‌దే | AFG-A Vs IND-A, 2nd ODI Toss Update And Playing 11, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

IND vs AFG: అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌.. బ్యాటింగ్‌ భారత్‌దే

Jun 11 2026 9:48 AM | Updated on Jun 11 2026 4:18 PM

AFG-A vs IND-A, 2nd ODI Toss Update And Playing 11

ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదిక‌గా భార‌త్‌-ఎ, అఫ్గానిస్తాన్‌-ఎ జట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంకపై సంచలన విజయం సాధించిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది.

మెన్‌ ఇన్‌ బ్లూ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.కాగా అందరి కళ్లు యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీపైనే ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో విఫలమైన వైభవ్‌.. ఇప్పుడు అఫ్గాన్‌పై ఎలా రాణిస్తాడా? అని ఎదురుచూస్తున్నారు.

తుది జట్లు
అఫ్గానిస్తాన్‌A: ఇమ్రాన్ మీర్ (కెప్టెన్‌),హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనివాల్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్‌జాయ్, బహిర్ షా, ఇషాక్ రహీమి(వికెట్‌ కీపర్‌), ఖలీల్ గుర్బాజ్, జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, మహ్మద్ ఇబ్రహీం, ఫర్మానుల్లా సఫీ

ఇండియా A: వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్‌కీపర్‌), ప్రియాంష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్‌), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement