కాబూల్: తాలిబన్ల అరాచక పాలనలో అఫ్గనిస్తాన్ పరిస్థితి దయనీయంగా మారడంతో అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ నిరవధిక వాయిదా పడింది. అఫ్గానిస్తాన్‌లో ఏర్పడిన పరిస్థితుల దృష్యా సిరీస్‌ను వాయిదా వేసినట్లు ఆఫ్గన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తాలిబన్లు తాము క్రికెట్‌కు మద్దతిస్తామని.. క్రికెటర్లు భయపడాల్సిన అవసరం లేదని.. స్వేచ్చగా ఆడుకోవచ్చని తెలిపింది. అయితే తాలిబన్ ప్రకటన చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే అఫ్గన్ క్రికెట్ బోర్డు నుంచి సిరీస్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటన రావడం ఆశ్చర్యపరిచింది.
ఇక అఫ్గన్, పాకిస్తాన్‌ల మధ్య శ్రీలంక వేదికగా సెప్టెంబర్ 1 నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలుకావాల్సి ఉంది. సెప్టెంబర్ 1న తొలి వన్డే, 3న రెండో వన్డే, 5న చివరి వన్డే జరగాల్సి ఉంది.
చదవండి: Taliban Controversy: రాజస్తాన్ క్రికెట్‌లో 'తాలిబన్' జట్టు కలకలం
Comments
Please login to add a commentAdd a comment