
దుబాయ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, హీరోయిన్ అనుష్క శర్మ జంట సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా పర్యటన (టూర్)కు ముందు విరాట్ తన షూని శుభ్రం చేస్తున్న ఫోటోను అనుష్క షేర్ చేశారు. మట్టితో ఉన్న షూని ఎంతో శ్రద్ధగా విరాట్ క్లీన్ చేస్తున్నాడంటూ ఆమె తెలిపారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఈ జంట త్వరలోనే స్వదేశానికి రానున్నారు. గర్భవతిగా ఉన్న అనుష్కకు ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండాలని కోహ్లి భావించాడు.
ఈ మేరకు తన మనసులోని మాటను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రముఖులకు తెలిపగా, కోహ్లి అభ్యర్థనను బీసీసీఐ అంగీకరించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనితో పోలిక తెచ్చిన నెటిజన్లు, కోహ్లి వ్యవహారశైలిని విమర్శిస్తున్నారు. దేశం తరఫున ఆడటం కంటే వ్యక్తిగత విషయాలకే కోహ్లి ప్రాధాన్యం ఇస్తున్నాడని, కానీ ధోని మాత్రం జీవా(ధోని కూతురు) జన్మించిన సమయంలో భార్యాపిల్లలను వదిలి జట్టును ముందుకు నడిపించడంపై దృష్టి సారించాడని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. (తొలి టెస్టు తర్వాత స్వదేశానికి కోహ్లి.. ట్రోలింగ్! )
ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కోహ్లికి అనుమతి మంజూరు చేసింది. దీంతో ఆస్ట్రేలియాతో జనవరి తొలి వారం నుంచి జరగనున్న చివరి రెండు టెస్టులకు కెప్టెన్ విరాట్ కోహ్లి దూరం కానున్నాడు. విరాట్ స్థానంలో ఆసీస్ టూర్‌కు రోహిత్ శర్మను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇటీవలె 32వ ఏటలోకి ప్రవేశించిన విరాట్ పుట్టినరోజు వేడుకలు దుబాయ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఆర్‌సీబీ టీమ్ సభ్యుల సమక్షంలో జరిగిన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సం‍్బంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2017 డిసెంబర్ 11న ఇటలీలో ప్రేమ వివాహం చేసుకున్న విరుష్కలు తామిద్దరూ త్వరలో ముగ్గురం కాబోతున్నామని, వచ్చే జనవరిలో తమ ఇంట్లోకి మూడో వ్యక్తి ప్రవేశించబోతున్నట్లు ఇప్పటికే తెలిపారు. (వైరలవుతున్న కోహ్లి బర్త్‌డే వేడుకలు)
Comments
Please login to add a commentAdd a comment