ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్తాన్-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్ల మధ్య ఇవాళ (జూన్ 20) జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీమ్ 6 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 16 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశ నుంచి తేరుకుని అద్భుత విజయం నమోదు చేసింది. వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా మహిళలు.. 9 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేయగా.. ఛేదనలో పాక్ ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేక 4 వికెట్ల నష్టానికి 53 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. 21 పరుగులు చేసిన బంగ్లా బ్యాటర్ నహీద అక్తర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ ఫైనల్‌కు చేరుకుంది.
Bangladesh-A women have snatched victory from the jaws of defeat against Pakistan-A in the second semi-final of the Women's Emerging Asia Cup.#BANWvsPAKW pic.twitter.com/olrAa05wg3
— CricTracker (@Cricketracker) June 20, 2023
మరోవైపు ఈ టోర్నీలో భారత మహిళల జట్టు కూడా ఫైనల్‌కు చేరుకుంది. శ్రీలంక-ఏతో జరగాల్సిన సెమీఫైనల్-1 వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో, గ్రూప్ టాపర్ హోదాలో భారత్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. భారత్ ఉన్న గ్రూప్‌లో పాకిస్తాన్, నేపాల్, ఆతిధ్య హాంగ్‌కాంగ్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో భారత్ ఒకే ఒక మ్యాచ్ (జూన్ 13) ఆడింది. ఇందులో హాంగ్‌కాంగ్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
𝙄𝙣𝙩𝙤 𝙏𝙝𝙚 𝙁𝙞𝙣𝙖𝙡! 🙌 🙌
— BCCI Women (@BCCIWomen) June 20, 2023
Congratulations to India 'A' as they seal a spot in the #WomensEmergingTeamsAsiaCup summit clash 👏 👏#ACC pic.twitter.com/FFdUo4vzlG
ఆ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు హాంగ్‌కాంగ్‌ను 14 ఓవర్లలో కేవలం 34 పరుగులకే ఆలౌట్ చేశారు. శ్రేయాంక్ పాటిల్ అత్యుత్తమ గణాంకాలు (3-1-2-5) నమోదు చేసింది. ఛేదనలో భారత్.. కెప్టెన్ శ్వేత సెహ్రావత్ వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. గొంగడి త్రిష, ఛెత్రి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. కాగా, రేపు (జూన్ 21) జరుగబోయే ఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ జట్లు అమీతుమీ తేల్చుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment