ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు జితేశ్ శర్మ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గతేడాది 10 ఇన్నింగ్స్‌లో 234 పరుగులు సాధించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 16వ ఎడిషన్లో 14 ఇన్నింగ్స్‌లో 309 రన్స్ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఓసారి టీమిండియాకు ఎంపికైన జితేశ్‌కు తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు.
శ్రీలంకతో టీ20 సిరీస్ నేపథ్యంలో ఈ విదర్భ బ్యాటర్‌కు పిలుపు వచ్చింది. కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ గాయపడటంతో అతడి స్థానంలో జితేశ్‌ను జట్టులోకి తీసుకున్నారు. కానీ ఇషాన్ కిషన్ రూపంలో వికెట్ కీపర్ అందుబాటులో ఉండటంతో అతడికి ఆడే అవకాశం రాలేదు.
ఈ క్రమంలో ఆసియా క్రీడలు-2023 సందర్భంగా మరోసారి అదృష్టం జితేశ్ తలుపుతట్టింది. చైనాలో జరుగునున్న ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొననున్న భారత ద్వితీయ శ్రేణి జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఏబీపీ న్యూస్‌తో మాట్లాడిన జితేశ్ మొదటిసారి జట్టుకు ఎంపికైనపుడు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో జరిగిన సంభాషణ గురించి వెల్లడించాడు.
‘‘జితేశ్.. నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావో తెలుసా?’’ అని ద్రవిడ్ అడిగారు. అందుకు బదులుగా.. ‘‘వీలైనంత ఎక్కువ స్ట్రైక్‌రేటు నమోదు చేయడం నా బలం. త్వరత్వరగా పరుగులు రాబడతాను. అందుకే నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు’’ అని సమాధానమిచ్చాను.
అందుకు రాహుల్ సర్ కూడా.. ‘‘అవును.. నువ్వు ఇక్కడిదాకా వచ్చింది అందుకే! నీదైన శైలిలో ఆడు.. జట్టు కోసం ఆడు.. ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది’’ అని చెప్పారు’’ అంటూ 29 ఏళ్ల జితేశ్ డ్రెస్సింగ్‌రూం అనుభవాలు పంచుకున్నాడు. కాగా ఆసియా క్రీడలకు రింకూ సింగ్, జితేశ్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ తదితరులు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకుడు.
Comments
Please login to add a commentAdd a comment