
ఢాకా: ఆస్ట్రేలియా జట్టుకు బంగ్లాదేశ్ మరోసారి షాక్ ఇచ్చింది. తొలి టీ20 ఓటమి నుంచి తేరుకోకుండానే ఆసీస్‌ను వరుసగా రెండో టీ20 లో ఓడించి బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. ఢాకా వేదికగా జరిగిన రెండో టీ20లో ఆసీస్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన బంగ్లా ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బంగ్లా బౌలర్ల దాటికి 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిక్స్ 30 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 3 వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్ 2, షకీబ్, మెహదీ హసన్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.4 ఓవర్లలో5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు మహ్మద్ నయీమ్(9), సౌమ్యా సర్కార్‌లు(0)లు తొందరగా ఔటైనా.. షకీబ్ 26, మెహదీ హసన్ 23 పరుగులతో ఇన్నింగ్స్‌ను నిర్మించారు. చివర్లో అఫిఫ్ హొస్సేన్ 37 నాటౌట్, వికెట్ కీపర్ నూరుల్ హసన్ 22 నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను గెలిపించారు.
Comments
Please login to add a commentAdd a comment