Aus Vs Zim 2nd ODI: Australia Beat Zimbabwe By 8 Wickets 2nd ODI Seal Series 2-0 - Sakshi
Sakshi News home page

AUS Vs ZIM: జింబాబ్వేతో రెండో వన్డే.. మూడు గంటల్లో ముగించిన ఆసీస్‌

Published Wed, Aug 31 2022 9:23 AM | Last Updated on Wed, Aug 31 2022 2:22 PM

Australia Beat Zimbabwe By 8 Wickets 2nd ODI Seal Series 2-0 - Sakshi

జింబాబ్వేతో బుధవారం ఉదయం జరిగిన రెండో వన్డేను ఆస్ట్రేలియా కేవలం మూడు గంటల్లోనే ముగించింది. అసలు ఆడుతుంది వన్డేనా లేక టి20న అన్న తరహాలో జింబాబ్వే ఇన్నింగ్స్‌ సాగింది. టీమిండియాపై కనీస స్థాయిలో పోరాడిన జింబాబ్వే.. ఆస్ట్రేలియా దెబ్బకు తోకముడిచింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మరొక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే ఆసీస్‌ బౌలర్ల దాటికి 27.5 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. 

ఆస్ట్రేలియాపై జింబాబ్వేకు వన్డేల్లో ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. సీన్‌ విలియమ్స్‌ 29 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. ఆ  తర్వాత సికందర్‌ రజా 17 పరుగులు చేశాడు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌, ఆడమ్‌ జంపా చెరో మూడు వికెట్లు తీయగా.. కామెరాన్‌ గ్రీన్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. స్టీవ్‌ స్మిత్‌ 43 నాటౌట్‌, అలెక్స్‌ క్యారీ 26 నాటౌట్‌ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో వన్డే సెప్టెంబర్‌ 3న జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement