Photo Credit: Twitter
ఆస్ట్రేలియాను టెస్టుల్లో వారి సొంతగడ్డపైనే మట్టికరిపించిన బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో 23 ఏళ్ల ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాను వారి హోంగ్రౌండ్‌లోనే ఓడించి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఒకసారి వాటిని పరిశీలిద్దాం.
9 వికెట్లతో విజయం: వికెట్ల పరంగా బంగ్లాదేశ్‌కు ఇది రెండో అతిపెద్ద టెస్టు విజయం. 2024లో రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
2- బంగ్లాదేశ్‌కు ఆస్ట్రేలియాపై టెస్టుల్లో ఇది రెండో విజయం. గతంలో 2017 మీర్పూర్ టెస్టులో ఆసీస్‌ను తొలిసారి ఓడించింది. ఆసీస్ గడ్డపై మాత్రం బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం. అంతేకాదు ఆసీస్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించడం కూడా ఇదే మొదటిసారి. కాగా ఆసీస్‌తో జరిగిన ఏడు టెస్టుల్లో బంగ్లాకు ఇది రెండో విజయం.
SENA: సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో రెండింటి ఓడించిన జట్టుగా బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. 2022లో మౌంట్ మాంగనుయిలో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన బంగ్లా తాజాగా ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించింది.
👉ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ ఇప్పటివరకు మూడు టెస్టులు మాత్రమే ఆడింది. అయితే కేవలం మూడు టెస్టుల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసిన బంగ్లాదేశ్ ఫీట్ ఆసియా జట్ల పరంగా అత్యంత వేగవంతమైనదిగా నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్‌కు ఏడు టెస్టుల తర్వాత, భారత్‌కు 12 టెస్టుల తర్వాత తొలి టెస్టు విజయం దక్కింది. ఈ రెండు దేశాలను బంగ్లాదేశ్ అధిగమించడం విశేషం. మరోవైపు శ్రీలంక మాత్రం ఆసీస్ గడ్డపై 15 టెస్టులు ఆడినప్పటికీ ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది.
👉1995 తర్వాత ఆస్ట్రేలియాను తమ సొంతగడ్డపై భారత్ కాకుండా మరో ఆసియా జట్టు (బంగ్లాదేశ్) ఓడించడం 31 ఏళ్లలో ఇదే తొలిసారి.
👉సొంతగడ్డపై రెండుసార్లు ఆసియా జట్ల (భారత్, బంగ్లాదేశ్) చేతిలో ఓటమి చవిచూసిన తొలి కెప్టెన్‌గా పాట్ కమిన్స్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 2024లో భారత్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా తాజాగా బంగ్లాదేశ్ చేతిలో పరాజయం చవిచూసింది.
Historic Win in Darwin! 🇧🇩🔥 Bangladesh beat Australia by 9 wickets to seal a memorable victory in the 1st Test! 🏏🏆#Bangladesh #Tigers #BANvAUS #Cricket pic.twitter.com/PDrWJS8ZEs
— Bangladesh Cricket (@BCBtigers) August 16, 2026
HISTORY WRITTEN
Bangladesh becomes the Asian team to take least number of Tests to beat Australia in #Australia 🤯#Banvsaus #Australiancricket #Bangladeshcricket #Cricket #BANVSAUS pic.twitter.com/SE42IBxCbo— PRAKASH (@CHPRAKASH07) August 16, 2026


