బుమ్రా- శ్రేయస్ అయ్యర్ (PC: BCCI)
Jasprit Bumrah and Shreyas Iyer Medical Update: టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ల ఫిట్‌నెస్ గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక అప్‌డేట్ అందించింది. బుమ్రాకు సర్జరీ విజయవంతంగా పూర్తైందని తెలిపిన బీసీసీఐ.. ప్రస్తుతం ఈ స్పీడ్‌స్టర్ వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది.
ఇక శ్రేయస్ అయ్యర్‌కు వచ్చే వారం సర్జరీ జరుగనుందని పేర్కొంది. వెన్నునొప్పితో బాధపడుతున్న అయ్యర్ రెండు వారాల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటాడని.. తర్వాతే జాతీయ క్రికెట్ అకాడమీకి వస్తాడని బీసీసీఐ తెలిపింది. ఇందుకు సంబంధించి శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
బుమ్రాకు న్యూజిలాండ్‌లో సర్జరీ సక్సెస్
ఈ మేరకు.. ‘‘వెన్ను దిగువ భాగంలో తీవ్రనొప్పితో అల్లాడుతున్న జస్‌ప్రీత్ బుమ్రాకు న్యూజిలాండ్‌లో సర్జరీ జరిగింది. అతడు ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. స్పెషలిస్టుల సూచన మేరకు ఈ ఫాస్ట్‌బౌలర్ ఆరు వారాల పాటు రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉండనున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నుంచి అతడు జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ మొదలుపెడతాడు.
శ్రేయన్ అయ్యర్ కూడా
ఇక మిస్టర్ శ్రేయస్ అయ్యర్‌కు వచ్చే వారం సర్జరీ జరుగనుంది. సర్జరీ పూర్తైన తర్వాత అతడు ఎన్‌సీఏకు చేరుకుంటాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. కాగా బుమ్రా మాదిరే.. అయ్యర్ కూడా పూర్తిగా కోలుకుంటే టీమిండియా మరింత పటిష్టమవుతుంది.
వన్డే వరల్డ్‌కప్ నాటికి
ఇప్పటికే వెన్నునొప్పి కారణంగా గతేడాది ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ టోర్నీకి బుమ్రా దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక ఇప్పుడు సర్జరీ పూర్తైన్పటికీ అతడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.
అయితే, వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ వరకు బుమ్రా జట్టుతో చేరనున్నాడని తాజా సమాచారం ప్రకారం వెల్లడైంది. మరోవైపు.. అయ్యర్ సైతం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైనప్పటికీ ప్రపంచకప్ టోర్నీకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
చదవండి: IPL 2023: సూర్య పన్నెండుసార్లు డకౌట్ అయినా పర్లేదు.. ఫరక్ పడదు!
ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. తొలి సన్‌రైజర్స్ ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment