
ముంబై: కరోనా వైరస్ మళ్లీ విజృంభించడంతో ఈ నెల 13న ప్రారంభానికి సిద్ధమైన రంజీ ట్రోఫీ సహా, సీకే నాయుడు ట్రోఫీ, సీనియర్ మహిళల టి20 లీగ్ టోర్న మెంట్లను వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక ప్రకటనలో తెలిపింది. ఆటగాళ్లు, సిబ్బంది, టోర్నీ అధికారుల ఆరోగ్యానికే తమ తొలి ప్రాధాన్యమని, ఈ నేపథ్యంలోనే టోర్నీలు ముందనుకున్న షెడ్యూలు ప్రకారం జరిగే అవకాశం లేదని ఆ ప్రకటనలో పేర్కొంది. తిరిగి ఎప్పుడు నిర్వహించేది కేసుల తీవ్రత, అనుకూల పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment