Internet Has The Best Response To BCCI Tweet Over Anushka Sharma: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ పేరున బీసీసీఐ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతుంది. ఇందులో అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. దీంతో అనుష్క శర్మ ఏంటీ, క్రికెట్ ఆడటమేంటి అని నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే..
Anushka Sharma 52 runs in 88 balls (5x4, 1x6) India B 140/0 #U19ChallengerTrophy
— BCCI Women (@BCCIWomen) November 2, 2021
భారత మహిళల అండర్-19 ఛాలెంజర్స్ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు చెందిన అనుష్క శర్మ అనే అమ్మాయి భారత-బి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. మంగళవారం(నవంబర్ 2) భారత్-ఏ తో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఆల్‌రౌండ్ ప్రతిభ చూపి సత్తా చాటింది. మొదట బ్యాటింగ్‌లో 88 బంతుల్లో 52 పరుగులు చేసిన అనుష్క.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రాణించి ఐదు వికెట్లు తీసింది. దీంతో బీసీసీఐ తమ అధికారిక మహిళల ట్విట్టర్ హ్యాండిల్‌లో అనుష్క శర్మను అభినందిస్తూ ఓ పోస్ట్ చేసింది.
Abey isne Cricket khelna kab se shuru kar diya : pic.twitter.com/olGgNLw0Ae
— Kushagra (@45kusha) November 2, 2021
ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు అనుష్క ఎప్పటి నుంచి క్రికెట్ ఆడడం ప్రారంభించిందని గందరగోళానికి గురవుతున్నారు. మరికొందరేమో.. భార్యాభర్తలిద్దరూ క్రికెట్ గ్రౌండ్‌లో ఉంటే వామికను ఎవరు చూసుకుంటున్నారంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో కోహ్లి అతని కుటంబంపై కొందరు సోషల్‌మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Tumlog btaye kyu nhi Ki Anushka match khelne gyi hai , vamika ro rhi hai pic.twitter.com/s0yZVy7bej
— Sumit □◇○ (@UN_PrEdiTAble) November 2, 2021
చదవండి: T20 WC 2021 IND Vs AFG: అరుదైన రికార్డుపై కన్నేసిన టీమిండియా స్టార్ పేసర్..
Comments
Please login to add a commentAdd a comment