కోల్‌కతా: సాధారణంగా టీవీ బ్రాడ్‌కాస్టర్లు ఒక ఇన్నింగ్స్ ముగిశాక, లేదంటే మ్యాచ్ పూర్తయ్యాక మొత్తమ్మీద ఐదారు నిమిషాలు హైలైట్స్ చూపిస్తారు. కానీ ఈ మ్యాచ్‌లో అజింక్య రహానే తను ఆడుతున్నంతసేపూ హైలైట్స్ చూపాడు. వన్నె తగ్గిన ఈ వెటరన్ తనలో దంచేసే సత్తా ఇంకా తగ్గలేదని సుడిగాలి ఇన్నింగ్స్ (29 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు)తో నిరూపించాడు. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్ 49 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది.
ముందుగా సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీస్కోరు చేసింది. శివమ్ దూబే (21 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), కాన్వే (40 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా అర్ధ సెంచరీలు చేశారు. కష్టమైన లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులే చేయగలిగింది. జట్టు స్కోరు 1 పరుగుకే ఓపెనర్లు నరైన్ (0), జగదీశన్ (1)లు... కాసేపటికి వెంకటేశ్ (20), నితీశ్ రాణా (27) అవుటవడంతో నైట్‌రైడర్స్ లక్ష్యానికి దూరమైంది.
జేసన్ రాయ్ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ షాట్లతో అలరించారు. చెన్నై బౌలర్లలో తుషార్, తీక్షణలకు రెండేసి వికెట్లు దక్కాయి.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (బి) సయశ్ శర్మ 35; కాన్వే (సి) వీస్ (బి) వరుణ్ చక్రవర్తి 56; రహానే (నాటౌట్) 71; శివమ్ దూబే (సి) జేసన్ రాయ్ (బి) ఖెజ్రోలియా 50; జడేజా (సి) రింకూ సింగ్ (బి) ఖెజ్రోలియా 18; ధోని (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–73, 2–109, 3–194, 4–232. బౌలింగ్: ఉమేశ్ 3–0–35–0, వీస్ 3–0–38–0, వరుణ్ 4–0–49–1, కుల్వంత్ ఖెజ్రోలియా 3–0–44–2, నరైన్ 2–0–23–0, సుయశ్ శర్మ 4–0–29–1, రసెల్ 1–0–17–0.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: జగదీశన్ (సి) జడేజా (బి) తుషార్ 1; నరైన్ (బి) ఆకాశ్ సింగ్ 0; వెంకటేశ్ అయ్యర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మొయిన్ అలీ 20; నితీశ్ రాణా (సి) రుతురాజ్ (బి) జడేజా 27; జేసన్ రాయ్ (బి) తీక్షణ 61; రింకూ సింగ్ (నాటౌట్) 53; రసెల్ (సి) శివమ్ దూబే (బి) పతిరణ 9; వీస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తుషార్ 1; ఉమేశ్ (సి) కాన్వే (బి) తీక్షణ 4; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–46, 4–70, 5–135, 6–162, 7–171, 8–180.
బౌలింగ్: ఆకాశ్4–0–29–1, తుషార్ 4–0–43–2, తీక్షణ 4–0–32–2, మొయిన్ అలీ 1–0–20–1, జడేజా 3–0–34–1, పతిరణ 4–0–27–1.
ఐపీఎల్‌లో నేడు
హైదరాబాద్ vs ఢిల్లీ (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment