చెన్నై: చెపాక్‌లో చెన్నై చేసిన స్కోరు, సొంతగడ్డపై కనబరిచిన జోరు తక్కువే... కానీ అంతకంటే తక్కువకే ఢిల్లీ క్యాపిటల్స్‌ను కట్టడి చేసి మ్యాచ్ గెలిచింది. బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సూపర్‌కింగ్స్ 27 పరుగుల తేడాతో క్యాపిటల్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. శివమ్ దూబే (12 బంతుల్లో 25; 3 సిక్సర్లు) పరుగులే ఇన్నింగ్స్ టాప్‌స్కోర్.
బెంగళూరుపై భారీ స్కోరును ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో 168 పరుగుల లక్ష్యాన్ని అధిగమించలేకపోయింది. 20 ఓవర్లు పూర్తిగా ఆడి 8 వికెట్లకు 140 పరుగులే చేయగలిగింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన జడేజా (21 పరుగులు; 1 వికెట్)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. వార్నర్ (0), సాల్ట్ (17)లను దీపక్ చహర్ అవుట్ చేయగా, మార్ష్ (5) రనౌట్ కావడంతోనే మ్యాచ్‌లో ఢిల్లీ వెనుకబడిపోయింది.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) అమన్ (బి) అక్షర్ 24; కాన్వే (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్ 10; రహానే (సి అండ్ బి) లలిత్ 21; మొయిన్ అలీ (సి) మార్ష్ (బి) కుల్దీప్ 7; దూబే (సి) వార్నర్ (బి) మార్ష్ 25; రాయుడు (సి) రిపాల్ (బి) ఖలీల్ 23; జడేజా (సి) అక్షర్ (బి) మార్ష్ 21; ధోని (సి) వార్నర్ (బి) మార్ష్ 20; దీపక్ (నాటౌట్) 1; తుషార్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–32, 2–49, 3–64, 4–77, 5–113, 6–126, 7–164, 8–166. బౌలింగ్: ఖలీల్ 4–0–32–1, ఇషాంత్ 2–0–23–0, లలిత్ యాదవ్ 3–0–34–1, అక్షర్ 4–0–27–2, కుల్దీప్ యాదవ్ 4–0–28–1, మిచెల్ మార్ష్ 3–0–18–3.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) రహానే (బి) చహర్ 0; సాల్ట్ (సి) రాయుడు (బి) చహర్ 17; మార్ష్ (రనౌట్) 5; పాండే (ఎల్బీడబ్ల్యూ) (బి) పతిరణ 27; రోసో (సి) పతిరణ (బి) జడేజా 35; రిపాల్ (రనౌట్) 10; అక్షర్ (సి) రహానే (బి) పతిరణ 21; అమన్ (నాటౌట్) 2; లలిత్ (బి) పతిరణ 12; కుల్దీప్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 140. వికెట్ల పతనం: 1–0, 2–20, 3–25, 4–84, 5–89, 6–116, 7–125, 8–140. బౌలింగ్: చహర్ 3–0– 28–2, తుషార్ 3–0–18–0, తీక్షణ 2–0–16–0, రవీంద్ర జడేజా 4–0–19–1, మొయిన్ అలీ 4–0–16–0, పతిరణ 4–0–37–3.
ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా VS రాజస్తాన్ (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment