సెమీస్‌కు దూసుకెళ్లిన గాఫ్‌.. పిన్న వ‌య‌స్కురాలిగా చ‌రిత్ర‌ | Coco Gauff Beat Jessica Pegula Enters Semi Final-1st-Time-Wimbledon 2026 | Sakshi
Sakshi News home page

సెమీస్‌కు దూసుకెళ్లిన కోకో గాఫ్‌.. పిన్న వ‌య‌స్కురాలిగా చ‌రిత్ర‌

Jul 7 2026 9:09 PM | Updated on Jul 7 2026 9:23 PM

Coco Gauff Beat Jessica Pegula Enters Semi Final-1st-Time-Wimbledon 2026

వింబుల్డ‌న్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో అమెరికా న‌ల్ల‌క‌లువ కోకో గాఫ్ సెమీఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. మ‌హిళ‌ల సింగిల్స్‌లో భాగంగా మంగ‌ళ‌వారం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్లో గాఫ్ 4-6, 6-3, 6-3తో త‌న దేశానికే చెందిన జెస్సికా పెగులాను చిత్తుగా ఓడించింది. ఈ నేప‌థ్యంలో వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో గాఫ్‌ తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. 

అంతేకాదు టెన్నిస్‌లో నాలుగు మేజ‌ర్‌ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీస్ చేరిన రెండో అతి పిన్న వ‌య‌స్కురాలిగా గాఫ్ (22 ఏళ్లు)  చ‌రిత్ర సృష్టించింది. గ‌తంలో మారియా ష‌ర‌పోవా 2007 ఫ్రెంచ్ ఓపెన్‌లో (19 ఏళ్లు) ఈ ఫీట్ సాధించింది.  

ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో ప్ర‌పంచ నంబ‌ర్‌వ‌న్ జానిక్ సిన్న‌ర్ (ఇట‌లీ) 7-5, 7-6 (7-4), 6-3తో జ‌ర్మ‌నీకి చెందిన అన్‌సీడెడ్ జేఎల్ స్ట్ర‌ఫ్‌ను మ‌ట్టికరిపించి సెమీస్‌లో అడుగుపెట్టాడు.

ఇక సెమీస్‌లో గాఫ్.. నవోమి ఒసాకా, ముచోవా మధ్య విజేతతో తలపడనుంది. రేపు జరగబోయే మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నొస్కోవా, మెర్టెన్స్ తలపడనుండగా, మరో క్వార్టర్స్‌లో మరియా కొత్య్సూక్‌, జాస్మిన్ పవోలిని తలపడనున్నారు.

చదవండి: వివాదంలో ఎంబాపె.. ‘క్షమాపణ చెప్పకపోతే కోర్టుకీడుస్తా!’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement