ముంబై: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత పది రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒక్క రోజే వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సెగ ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ)ను తాకింది. 15 మంది సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో ఎంసీఏ కార్యాలయాన్ని మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు.
ఈ విషయం గురించి ఎంసీఏ వర్గాలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘‘మా సిబ్బందిలోని చాలా మంది కరోనా బారిన పడ్డారు. అందుకే శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఆఫీసు మూసివేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. కాగా గురువారం ఒక్కరోజే మహారాష్ట్రలో సుమారు 20 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే దేశవాళీ టోర్నీలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయ సిబ్బంది ముగ్గురికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇక దేశావ్యాప్తంగా గడిచిన 24 గంటలలో కొత్తగా 1,17,100 కరోనా కేసులు నమోదయ్యాయి.
చదవండి: ICC Big Rule Change: టీ20 ఫార్మాట్‌లో కీలక మార్పులు... ఈ నెల నుంచే కొత్త నిబంధనలు.. టీమిండియాకు..
Comments
Please login to add a commentAdd a comment