‘ఏదీ కలిసిరావడం లేదు.. ఓటమికి అదే కారణం’ | CSK Captain Ruturaj Gaikwad Comments After Match Lost Vs Punjab Kings | Sakshi
Sakshi News home page

Ruturaj Gaikwad: ‘ఏదీ కలిసిరావడం లేదు.. ఓటమికి అదే కారణం’

Apr 4 2026 9:33 AM | Updated on Apr 4 2026 9:40 AM

CSK Captain Ruturaj Gaikwad Comments After Match Lost Vs Punjab Kings

ఐపీఎల్ 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ ఆ జ‌ట్టు ఓడిపోయింది. బౌల‌ర్ల వైఫ‌ల్యం కార‌ణంగానే పంజాబ్‌తో మ్యాచ్‌లో ఓడిపోయామ‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. మ్యాచ్ ఓట‌మి అనంత‌రం రుతురాజ్ మాట్లాడాడు.

‘ఇది చాలా క‌ఠినమైన మ్యాచ్‌. అయిన‌ప్ప‌టికి కూడా ఈ మ్యాచ్ నుంచి ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. మా బ్యాట‌ర్లు చాలా బాగా ఆడారు. ముఖ్యంగా ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే శివమ్ దూబే కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా బ్యాటింగ్ విభాగం బాగా ఆడింది. మా బౌలింగ్ విభాగం మెరుగుప‌డాల్సి ఉంది. 

జట్టుకు ఏది అవసరమో, ఆ పాత్రకు అనుగుణంగా మారడమే ముఖ్యం. ఈరోజు వికెట్ కొంచెం గ్రిప్ అవుతున్నందున, బహుశా మరికొంత సేపు క్రీజులో నిలదొక్కుకోవాలని నాకు అనిపించింది. ఆ త‌రువాత వేగంగా ఆడాల‌ని అనుకున్నాను. అయితే.. దుర‌దృష్ట‌వ‌శాత్తు త‌ప్పుడు స‌మ‌యంలో ఔట్ అయ్యాను. నిజానికి 209 అనేది చాలా మంచి స్కోరు. పిచ్ నుంచి పేస‌ర్ల‌కు మంచి స‌హ‌కారం అందింది. 

రాహుల్ చాహ‌ర్‌ను ఇంపాక్ట్‌గా తీసుకోవ‌డంపై నేను ఒక్క‌టే ఆలోచించాను. ముగ్గురు సీమ‌ర్లు ఇద్ద‌రు రిస్ట్ స్పిన్న‌ర్ల‌తో ఆడాల‌ని అనుకున్నాము. ఈ కాంబినేష‌న్ జ‌ట్టుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌నుకున్నా. కానీ మా స్పిన్న‌ర్ల‌కు ఈ రోజు అస‌లు కలిసిరాలేదు. మ‌ధ్య ఓవ‌ర్ల‌లో ప్ర‌త్య‌ర్థిపై ఒత్తిడి పెంచ‌లేక‌పోయాము. అయితే మాది యువ జ‌ట్టు. అన‌వ‌స‌ర‌మైన అంచ‌నాల‌తో ఒత్తిడి పెంచుకోకూడ‌ద‌ని భావిస్తున్నాం’ అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఎంతపని చేశావ్‌ అయ్యర్‌.. పంజాబ్ జ‌ట్టుకు షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement