ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రూ.16 కోట్ల 25 లక్షల రికార్డు ధరకు కొనుగోలుచేసిన ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌ని సీఎస్‌కే విడిచిపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2023 సీజన్‌లో సీఎస్‌కేతో జతకట్టిన స్టోక్స్ గాయం కారణంగా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
ఆ రెండు మ్యాచ్‌ల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు. బౌలింగ్‌లో కూడా ఒకే ఒక్క ఓవర్ వేశాడు. ఆల్‌రౌండ్‌ర్‌గా తన సేవలు అందిస్తాడని కోట్లు ఖర్చుచేసిన సీఎస్‌కేకు ఈ ఇంగ్లీష్ ఆటగాడు బొమ్మ చూపించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే ప్రపంచకప్ 2023కు ముందు స్టోక్స్ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు.
దీంతో అతడి మళ్లీ వన్డేల్లో ఆడనున్నాడు. అయితే ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్న స్టోక్స్ కొన్నాళ్ల పాటు కేవలం బ్యాటర్‌గా మాత్రమే జట్టులో కొనసాగనున్నాడు. అదే విధంగా వరల్డ్‌కప్ ముగిసిన అనంతరం రెండు నెలల వ్యవధిలో తిరిగి మళ్లీ భారత్‌కు రానున్నాడు. వచ్చే ఏడాది జనవరి ఆఖరిలో ఇంగ్లండ్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు భారత్‌కు రానుంది.
ఈ సిరీస్ మార్చి మధ్య వరకు జరగనుంది. ఈ క్రమంలో వర్క్‌లోడ్ కారణంగా అదే నెలలో ఆరంభం కానున్న ఐపీఎల్-2024కు స్టోక్స్ దూరంగా ఉండాలని నిర్ణయించకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సీఎస్‌కే మెనెజ్‌మెంట్ కూడా స్టోక్స్‌నే వదులుకోవడమే బెటన్ అని భావిస్తోందట. అతడి స్ధానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను జట్టులోకి తీసుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు వినికిడి.
కాగా ఐపీఎల్ 2020 సీజన్‌లో కమ్మిన్స్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.15.50 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు విడిచిపెట్టింది. అయితే బీజీబీజీ షెడ్యూల్ కారణంగా అతడు ఐపీఎల్ వేలం నుంచి తన పేరును వెనుక్కి తీసుకున్నాడు. అయితే ఈ సారి ఐపీఎల్-2024 వేలంలో కమ్మిన్స్ పాల్గోనున్నాడు. దీంతో కమ్మిన్స్‌ని కొనుగోలు చేయడానికి సీఎస్‌కే గట్టిగా ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: Asia Cup 2023 Team India Squad: అందుకే చాహల్‌కు జట్టులో చోటివ్వలేదు.. ఆ విషయంలో కుల్దీప్ బెటర్!
Comments
Please login to add a commentAdd a comment