దుబాయ్: ఐపీఎల్-13లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని ముందుగా ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ సీఎస్‌కే రెండు మ్యాచ్‌లు ఆడగా ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించగా, ఒకటి ఓడిపోయింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఒక మ్యాచ్‌లోనూ గెలిచి శుభారంభం చేసింది. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఢిల్లీ గెలుపును అందుకుంది. ఇక రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన గత మ్యాచ్‌లో సీఎస్‌కే పోరాడి ఓడింది. గత మ్యాచ్‌లో ఫిట్‌నెస్ కారణంగా ఆడని అంబటి రాయుడు.. ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ అతని స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఎన్‌గిడి స్థానంలో హజల్‌వుడ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
రాజస్తాన్ నిర్దేశించిన 217 పరుగుల టార్గెట్‌లో సీఎస్‌కే 200 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఇదిలా ఉంచితే, ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ధోని టాస్ ఓడిపోలేదు. ప్రస్తుత మ్యాచ్‌తో కలుపుకుని మూడు మ్యాచ్‌ల్లోనూ ధోనినే టాస్ గెలిచాడు. మూడింటిలోనూ టాస్ గెలిచిన ధోని తొలుత ఫీల్డింగ్ వైపే మొగ్గుచూపాడు. ఇప్పటివరకూ సీఎస్‌కే-ఢిల్లీల మధ్య 21 మ్యాచ్‌లు జరిగాయి. అందులో సీఎస్‌కే 15, ఢిల్లీ 6 గెలిచాయి.
ఢిల్లీ క్యాపిటల్స్: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, షిమ్రోన్‌హెట్‌మెయిర్, రిషభ్ పంత్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, కగిసో రబడా, అమిత్ మిశ్రా, అన్రిచ్ నోర్త్‌జే, అవిష్ ఖాన్
సీఎస్‌కే: ఎంఎస్ ధోని(కెప్టెన్), మురళీ విజయ్, షేన్ వాట్సన్, డుప్లెసిస్, సామ్ కరాన్, రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, హజల్‌వుడ్, దీపర్ చాహర్, పీయూష్ చావ్లా
Comments
Please login to add a commentAdd a comment