ఎంఎస్ ధోని(ఫైల్‌ఫోటో)
దుబాయ్: రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడంపై అనేక విమర్శలు వచ్చాయి. భారీ లక్ష్య ఛేదనలో ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్ ఎందుకు దిగాల్సి వచ్చిందని పలువురు విమర్శలకు దిగారు. తాను యూఏఈకి వచ్చిన తర్వాత సరైన ప్రాక్టీస్ లేకపోయిన కారణంగానే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చానని అప్పుడు సమాధానం చెప్పాడు. కానీ కెవిన్ పీటర్సన్ లాంటి వారు ధోని సాకులు చెప్పడం మానేస్తే బాగుంటుందని క్లాస్ తీసుకున్నారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో భాగంగా ధోని బ్యాటింగ్ ఆర్డర్ గురించి అడగ్గా, పరిస్ధితిని బట్టి అది ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. (చదవండి: అంబటి రాయుడు ఫిట్ కాలేదు)
‘నా బ్యాటింగ్ ఆర్డర్ అనేది జట్టుకు ఏది మంచిదో దాన్ని బట్టే ఉంటుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందనే చూసే నా బ్యాటింగ్ ఆర్డర్ మారుతుంది. తప్పిదాలు చేస్తే మ్యాచ్‌లు గెలవలేం. రెండోసారి బ్యాటింగ్ చేయడమే ఇప్పటివరకూ చూసిన పరిస్థితుల్ని బట్టి కనబడుతోంది.. కొన్ని పిచ్‌లు చాలా స్లోగా ఉన్నాయి. ఇంకా టోర్నమెంట్ చాలా ఉంది. మనం 14 మ్యాచ్‌లు ఆడితే అన్నీ గెలవలేము కదా. కొన్ని మ్యాచ్‌లు ఓడిపోవడం సహజం. మ్యాచ్‌లో పోరుకు సిద్ధమైన తర్వాత నో బాల్స్ వంటి తప్పిదాలు చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మేము చివరి గేమ్‌లో 200 పరుగులు చేశాం. మా బ్యాటింగ్ బాగానే ఉంది. భారీ లక్ష్యం కావడంతో ఛేదన కష్టమైంది’ అని టాస్‌కు వచ్చిన సమయంలో ధోని స్పష్టం చేశాడు. రెండోసారి బ్యాటింగే అనుకూలంగా ఉండటంతో టాస్ గెలిచిన వెంటనే ఫీల్డింగ్ తీసుకుంటున్నట్లు ధోని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment