ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా మిగిలిన రెండో టెస్టు మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మాథ్యూ రేన్‌షా జట్టులోకి వచ్చాడు. కాగా తొలి రోజు ఆట సందర్భంగా డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు.
బౌన్సర్లతో భయపెట్టిన సిరాజ్
కాగా ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే వార్నర్‌ను భారత పేసర్లు మహ్మద్ షమీ, సిరాజ్ బౌన్సర్లతో భయపెట్టారు. ముఖ్యంగా సిరాజ్ వేసిన బౌన్సర్లను ఎదుర్కొవడానికి వార్నర్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో సిరాజ్ వేసిన ఓ బంతి వార్నర్ మోచేయికి బలంగా తగిలింది. నొప్పితో విలవిలలాడిన వార్నర్.. ఫిజియోల సాయంతో తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు.
అయితే మళ్లీ వార్నర్‌ను దురదృష్టం వెంటాడింది. వరుస క్రమంలో రెండు బౌన్సర్లు అతడి హెల్మెట్‌కు బలంగా తాకాయి. అనంతరం ఫిజియో మళ్లీ వచ్చి కంకషన్ టెస్ట్ నిర్వహించారు. అయితే కొద్దిసేపటికే మహమ్మద్ షమీ బౌలింగ్‌లో వార్నర్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
కాగా డ్రెసింగ్ రూంకి వెళ్లిన వార్నర్ నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వార్నర్ భారత్ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. ఇక వార్నర్ ప్రస్తుతం పేలవ ఫామ్‌లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన వార్నర్.. రెండో టెస్టులో కూడా కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: IND vs AUS: అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ.. బ్యాట్‌ను గట్టిగా బాదుతూ! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment