PC: IPL.com
ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తీరుమారలేదు. ఈ మెగా ఈవెంట్‌లో వరుసగా ఢిల్లీ వరుసగా నాలుగో ఓటమి చవిచూసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆఖరి వరకు పోరాడనప్పటకీ.. విజయం మాత్రం రోహిత్‌సేననే వరించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇకవరుసగా నాలుగో ఓటమిపై మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని వార్నర్ కొనియాడాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో వార్నర్ మాట్లాడుతూ.. "ఈ ఏడాది సీజన్‌లో గత మూడు మ్యాచ్‌లు కూడా ఉత్కంఠభరితంగా సాగాయి. ఆఖరి ఓవర్‌లోనే ఫలితం తేలింది. ఈ మ్యాచ్‌లో కూడా మేము చివరివరకు పోరాడం. ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైనప్పటికీ.. మా బాయ్స్ మాత్రం అద్భుతంగా రాణించారు. ముంబై టాపర్డర్‌లో రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మా జట్టులో నోర్జే, ముస్తాఫిజర్ రెహ్మన్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు.
వారు తమ స్థాయికి తగ్గట్టు ఈ మ్యాచ్‌లో ప్రదర్శన చేశారు. కానీ దురదృష్టవశాత్తూ మ్యాచ్లోఓడిపోయాం. అదేవిధంగా ఆఖరి బంతికి నేను రాంగ్ సైడ్ త్రో వేసాను. వికెట్ల హైట్ దృష్టిలోపెట్టుకొని పైకి విసరాను. అది ముంబైకు పాజిటివ్‌గా మారింది. అయితే వరుస క్రమంలో వికెట్లు కోల్పవడం కూడా మా విజయ అవకాశాలను కొంతమేరకు దెబ్బతీసింది.
ఇక అక్షర్ విషయానికి వస్తే.. అతడొక క్లాసిక్ ఆల్‌రౌండర్. అతడు స్ట్రైకింగ్ చేసే విధానం అద్భుతంగా ఉంటుంది. అటువంటి ఆటగాడు టాప్-4లో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుంది. అయితే గత మా మూడు మ్యాచ్‌ల్లో చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. మా తదుపరి మ్యాచ్‌లో గెలిచి ఖాతా తెరవాలని భావిస్తున్నాం" అని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: మ్యాచ్ ఓడినా వార్నర్ సరికొత్త చరిత్ర.. తొలి క్రికెటర్‌గా రికార్డు
Comments
Please login to add a commentAdd a comment