PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన విషయం విధితమే. ఇక గెలుపు జోషల్‌లో ఉన్న ఢిల్లీకు ఊహించని షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు జరిమానా ఐపీఎల్ నిర్వాహకులు విధించారు.
ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకు గాను వార్నర్ కు 12 లక్షల రూపాయ జరిమానా విధించినట్టు ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సీజన్‌లో క్యాపిటల్స్ చేసిన తొలి తప్పిదమే కాబట్టి వార్నర్‌కు కేవలం జరిమానా మాత్రమే పడింది.
ఇదే తప్పు రెండోసారి జరిగితే ఢిల్లీ కెప్టెన్ వార్నర్‌పై ఒక్క మ్యాచ్ నిషేధం పడనుంది. ఇక ఈ సీజన్ లో వార్నర్ కంటే ముందు జరిమానా ఎదుర్కొన్న కెప్టెన్ల జాబితాలో వరుసగా ఫాఫ్ డుప్లెసిస్ (ఆర్సీబీ), సంజూ శాంసన్ (రాజస్తాన్ ), సూర్యకుమార్ యాదవ్ (ముంబై), హార్ధిక్ పాండ్యా (గుజరాత్), కెఎల్ రాహుల్ (లక్నో) విరాట్ కోహ్లీ (ఆర్సీబీ) ఉన్నారు.
చదవండి: Ind Vs Aus WTC 2023: టీమిండియా ఆల్‌రౌండర్‌కు బంపరాఫర్.. పాపం సూర్యకుమార్!
Comments
Please login to add a commentAdd a comment