Know About New Records And Stats Broken In League Stage IPL 2023, See Details - Sakshi
Sakshi News home page

IPL 2023 Stats And Records: ఐపీఎల్‌ 2023 లీగ్‌ స్టేజీలో బద్దలైన రికార్డులివే

Published Tue, May 23 2023 5:07 PM | Last Updated on Tue, May 23 2023 6:20 PM

Details ABout-Stats-Records Broken In League Stage IPL 2023 - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్ ఆదివారం (మే 21)తో ముగిసింది. మొత్తం 70 మ్యాచ్లు జరిగాయి. మంగళవారం (మే 23) నుంచి ప్లేఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి లీగ్ స్టేజ్లో నమోదైన రికార్డులు గతంలో ఏ సీజన్‌లోనూ నమోదు కాలేదు. పరుగుల వరద పారిన ఈ సీజన్ లో లెక్కకు మిక్కిలిగా రికార్డులు బద్దలయ్యాయి. సిక్స్‌లు, 200+ స్కోర్లు, సెంచరీల పరంగా గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. మరి అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్‌లో బద్దలయిన రికార్డులు
► 7263 పరుగులతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లి నిలిచాడు.
► ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్ లోనే 11 సెంచరీలు నమోదయ్యాయి. ఒక ఐపీఎల్ సీజన్ లో నమోదైన అత్యధిక సెంచరీలు ఇవే. ఐపీఎల్ 2022లో 8 సెంచరీలతో ఉన్న రికార్డు బ్రేయింది.
► ముంబై ఇండియన్స్ ఈ ఏడాది నాలుగుసార్లు 200కుపైగా లక్ష్యాలను ఛేదించింది. ఒక సీజన్ లో ఒక టీమ్ అత్యధికసార్లు 200కుపైగా స్కోర్లను చేజ్ చేసిన ఘనతను సొంతం చేసుకుంది.
► ఆర్సీబీ ఈ సీజన్ లో ఐదుసార్లు 200కుపైగా రన్స్ సమర్పించుకుంది. ఒక సీజన్ లో ఒక టీమ్ అత్యధికసార్లు 200కుపైగా స్కోర్లు ఇచ్చిన రికార్డు ఇదే.
► ఈ ఏడాది ఇప్పటికే 35సార్లు ఒక ఇన్నింగ్స్ లో 200కుపైగా స్కోర్లు నమోదయ్యాయి. 2022లో 18సార్లతో ఉన్న రికార్డు బ్రేకయింది.
► ఈ ఏడాది విరాట్ కోహ్లి 2 సెంచరీలు చేశాడు. దీంతో ఐపీఎల్లో మొత్తం 7 సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచాడు.
► ఈ ఏడాది లీగ్ స్టేజ్ లోనే 1066 సిక్స్ లు నమోదయ్యాయి. ఒక సీజన్ లో నమోదైన అత్యధిక సిక్స్ ల రికార్డు ఇదే. 1062 సిక్స్ లతో 2022 సీజన్ పేరిట ఉన్న రికార్డు బ్రేకయింది.
► యశస్వి జైశ్వాల్ 625 రన్స్ చేశాడు. ఒక సీజన్ లో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ప్లేయర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే.
► జాస్ బట్లర్ ఈ ఏడాది ఐదుసార్లు డకౌటయ్యాడు. ఒక సీజన్ లో అత్యధిక డకౌట్లు అతడివే.
దినేష్ కార్తీక్ 17సార్లు డకౌటయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌటైన రికార్డు కార్తీక్ దే. రోహిత్ శర్మ 16 డకౌట్లతో రెండోస్థానంలో  ఉన్నాడు.
►  యజ్వేంద్ర చహల్ 187 వికెట్లతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.
► యశస్వి జైశ్వాల్ 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు.
► వరుసగా రెండో ఏడాది కూడా గుజరాత్ టైటన్స్ టేబుల్లో టాప్ లో నిలిచింది. ముంబై ఇండియన్స్ (2019, 2020) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమ్ గా నిలిచింది.

చదవండి: #ShubmanGill: సెంచరీతో కదం తొక్కి.. ఆర్‌సీబీని ఇంటికి పంపి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement