పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. ఇప్పటికే పురుషుల టీమ్ విభాగంలో ఆకట్టుకోలేకపోయిన ధీరజ్.. వ్యక్తిగత విభాగంలో హోరాహోరీగా పోరాడి వెనుదిరిగాడు. మంగళవారం పురుషుల తొలి రౌండ్‌లో ధీరజ్ 7–1తో ఆడమ్ లీ (చెక్ రిపబ్లిక్)పై గెలిచాడు.
అనంతరం రెండో రౌండ్‌లో చివరి వరకు పోరాడిన ధీరజ్ 5–6తో ఎరిక్ పీటర్స్ (కెనడా) చేతిలో ఓడాడు. ఐదు సెట్‌ల తర్వాత ఇద్దరూ 5–5తో సమంగా నిలిచారు. దాంతో ‘షూట్ ఆఫ్’ నిర్వహించారు. ‘షూట్ ఆఫ్’లో ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేశారు. అయితే ధీరజ్ కొట్టిన బాణం కంటే కెనడా ప్లేయర్ కొట్టిన బాణం కేంద్ర బిందువుకు సమీపంగా ఉండటంతో కెనడా ప్లేయర్‌ను విజేతగా ప్రకటించారు.
మహిళల విభాగంలో భారత్ ఆర్చర్ భజన్ కౌర్ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో భజన్ 7–3తో సిఫా (ఇండోనేసియా)పై గెలిచింది. అనంతరం రెండో రౌండ్‌లో 6–0తో మజర్ (పోలాండ్)పై నెగ్గింది. భారత్‌కే చెందిన అంకిత తొలి రౌండ్‌లో 4–6తో వియోలెటా (పోలాండ్) చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment