దుబాయ్: టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో అనుకున్న స్థాయిలో తమ ప్రదర్శన కనబరచలేదు. బుధవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచులో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం జట్టు ఓటమిపై ధోని మాట్లాడారు. 'కోల్‌కతాను 160 పరుగులకు కట్టడి చేయడంలో బౌలర్లు సఫలమయ్యారు. కరణ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఐతే మా బ్యాట్స్‌మెన్స్ సరిగ్గా ఆడలేకపోయారు. కోల్‌కతా బౌలర్లు మిడిల్ ఓవర్స్‌లో కొన్ని మంచి ఓవర్లు వేశారు. దాంతో మేము వికెట్లు కోల్పోయాం. ఆ సమయంలో సరిగ్గా ఆడుంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. ఆఖరి ఓవర్లలో బౌండరీలు సాధించడంలో విఫలమయ్యాం' అని ధోని పేర్కొన్నారు.
గత మ్యాచ్‌లో పంజాబ్ జట్టుపై 179 పరుగులను వికెట్ నష్టపోకుండా సునాయాసంగా ఛేదించిన చెన్నై జట్టు, మునుపటి ఫామ్‌ను తిరిగి సాధించిందని అనుకున్నారు. కానీ కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. షేన్ వాట్సన్ (50), అంబటి రాయుడు (30) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ రాణించలేదు. నాలుగో స్థానంలో వచ్చిన ధోని 11(12), కేదార్ జాదవ్ 7(12) పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. చివర్లో జడేజా 21(8) బ్యాట్‌తో మెరిపించినా ఫలితం లేకపోయింది.
(ఇదీ చదవండి: ‘వీళ్లిద్దరూ డాట్ బాల్స్ ఇలాగే తింటారు’)
Comments
Please login to add a commentAdd a comment