బార్బోడస్ వేదికగా వెస్టిండీస్‌తో తొలి వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్ వన్డే గురువారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. విండీస్‌పై టెస్టు సిరీస్‌లో కనబరిచిన జోరునే వన్డేల్లో కొనసాగించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు విండీస్ కూడా భారత జట్టుకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. తొలి వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ భారత వెటరన్ వికెట్ దినేష్ కార్తీక్ ఎంచుకున్నాడు.
తన ఎంపిక చేసిన జట్టులో భారత స్పిన్ ద్వయం యుజ్వేంద్ర చహాల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరికి చోటిచ్చాడు. అదే విధంగా వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు కాకుండా ఇషాన్ కిషన్‌కు ఛాన్స్ ఇచ్చాడు. మరోవైపు ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌కు కార్తీక్ ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. కార్తీక్ తన జట్టులో ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మను ఎంపిక చేశాడు.
వరుసగా రెండు, మూడు స్ధానాల్లో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌కు చోటు కల్పించాడు. ఇక మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజాకు ఛాన్స్ దక్కింది. ఫుల్‌టైమ్ స్పిన్నర్లగా చాహల్, కుల్దీప్ యాదవ్‌ను డికే ఎంపిక చేశాడు. అయితే తన ఎంచుకున్న జట్టులో పేసర్లగా మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం లభించింది. తొలి వన్డేకు డికే ఇద్దరు పేసర్లను మాత్రమే ఎంపిక చేయడం గమనార్హం.
దినేష్ కార్తీక్ ఎంపిక చేసిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి వన్డే.. టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Comments
Please login to add a commentAdd a comment