Photo Credit: Twitter
దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్ భారీ ఆధిక్యం సాధించింది. ఈస్ట్‌జోన్ బౌలర్లు అభిజిత్, షాబాజ్ అహ్మద్ ధాటికి నార్త్ ఈస్ట్ జోన్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా నార్త్ ఈస్ట్ జోన్ 111 పరుగులకే కుప్పకూలింది. అర్పిత్ సుభాష్ (32) టాప్ స్కోరర్‌గా నిలవగా, రాంగ్సన్ జొనాథన్ (21) పర్వాలేదనిపించాడు.
అభిజిత్ సర్కార్ 5 వికెట్లతో చెలరేగగా, షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ ఆడకుండా నార్త్ ఈస్ట్‌ను ఫాలోఆన్ ఆడిస్తోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి నార్త్ ఈస్ట్ జోన్ జట్టు వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది.
అంతకముందు ఈస్ట్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులకు ఆలౌటైంది. సుదీప్ కుమార్ (185 బంతుల్లో 146), షాబాజ్ అహ్మద్ (244 బంతుల్లో 167) సెంచరీలతో చెలరేగారు. కుమార్ కుషాగ్రా (55) అర్ధసెంచరీ సాధించాడు. నార్త్ ఈస్ట్ బౌలర్లలో ఫిరోజైమ్ జొతిన్, ఆకాశ్ చౌదరీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
ఎవరీ అభిజిత్ సర్కార్?
త్రిపురకు చెందిన అభిజిత్ సర్కార్ కుడిచేతి ఫాస్ట్ బౌలర్. 2022లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా అభిజిత్ తొలిసారి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌పై మూడు వికెట్ల ప్రదర్శనతో టోర్నమెంట్‌ను ప్రారంభించిన అభిజిత్, నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు.
ఆ తర్వాత 2022-23 రంజీ ట్రోఫీ సీజన్‌లో త్రిపుర తరఫున అభిజిత్ ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే 12 వికెట్లు పడగొట్టాడు. ఇందులో విదర్భపై ఆరు వికెట్ల చిరస్మరణీయ ప్రదర్శన ఉంది. ఇక 2024-25 రంజీ ట్రోఫీ సీజన్‌లో కేవలం ఆరు ఇన్నింగ్స్‌లలోనే 15 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్‌లో బరోడాపై ఐదు వికెట్ల ప్రదర్శనలతో మెరిశాడు.
pic.twitter.com/fNCliUpmou
🚨 THREE WICKETS IN ONE OVER! 🔥🔥🔥
Abhijit Sarkar completes his five-wicket haul in style, ripping through the batting with three wickets in the over! 🎯
That’s how you finish a fifer! 💥#DuleepTrophy #3rdManView— Third Man View (@3rdManView) August 24, 2026


