
లండన్: ఇంగ్లండ్‌లో ప్రస్తుతం ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడుతున్న టీమిండియా వచ్చే ఏడాది జులైలో మరోసారి అక్కడ పర్యటించనుంది. ఈ టూర్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. తాజాగా, 2022 సంవత్సరం ఇంగ్లండ్ షెడ్యూల్‌ను ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ షెడ్యూల్‌ను ప్రకటించింది. సాధారణంగా ప్రతి ఇంగ్లండ్ పర్యటనలో టెస్ట్‌లతో పాటు వన్డే, టీ20 సిరీస్‌లు కూడా జరుగుతుంటాయి.
అయితే, ఈసారి కొవిడ్ కారణంగా పరిమిత ఓవర్ల సిరీస్‌ను తర్వాత నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 1న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో టీ20 మ్యాచ్‌తో టీమిండియా టూర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జులై 3న ట్రెంట్‌బ్రిడ్జ్‌లో రెండో టీ20, జులై 6న ఎజియస్ బౌల్‌లో మూడో టీ20 జరుగుతుంది. ఇక జులై 9 ఎడ్‌బాస్టన్‌లో తొలి వన్డే, ఆ తర్వాత జులై 12న ఓవల్‌లో రెండోది, జులై 14న లార్డ్స్‌లో మూడో వన్డే జరుగుతాయి.
చదవండి: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. కివీస్‌పై తొలిసారి..
Comments
Please login to add a commentAdd a comment