Photo Credit: FIFA Twitter
ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌తో స్పెయిన్, రెండో సెమీస్‌లో అర్జెంటీనాతో ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ ఫార్వార్డ్ ప్లేయర్ మొస్తాఫా జీకో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిఫా టోర్నీ ముందే ఫిక్స్ అయిందని, అర్జెంటీనాను గెలిపించడం కోసమే టోర్నీ నిర్వహిస్తున్నట్లుగా తనకు అనిపిస్తోందని పేర్కొన్నాడు.
అర్జెంటీనాతో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఈజిప్ట్ 2-3 తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించి మెస్సీపై కూడా జీకో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బహుశా మెస్సీ గొప్ప ఆటగాడే కావొచ్చు, కానీ తాను ప్రధానంగా పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నుంచి స్ఫూర్తి పొందుతానని పేర్కొన్నాడు.
ఇక ప్రిక్వార్టర్స్‌లో ఓటమి అనంతరం ఈజిప్ట్ జట్టు అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసింది. మ్యాచ్ మొత్తం రిఫరీ అంపైరింగ్‌ను నిష్పక్షపాతంగా నిర్వహించలేదని, తమ జట్టుకు అన్యాయం జరిగిందని జీకో ఆరోపించాడు. తాము మెరుగైన ప్రదర్శన చేశామని, కానీ విజయం అనేది తమ చేతుల్లో లేదన్నాడు. టోర్నీ మొత్తం ముందే ఫిక్స్ అయిందని, రిఫరీ చేతుల మీదుగా ఫిక్సింగ్ నడుస్తోందని తెలిపాడు. అర్జెంటీనా కోసమే ఫిఫా నిర్వహిస్తున్నట్లు అందరికీ స్పష్టంగా అర్థమవుతోందని జీకో పేర్కొన్నాడు.
😂🏆 The Swiss players looked completely stunned, almost as if they were saying:
"Just hand the trophy to Argentina already!" 🤣
The reactions on their faces said it all — a mix of disbelief, frustration, and pure shock. Football always delivers these priceless moments! 😅⚽…— KUMAR (@MyCric101) July 13, 2026


