FIFA World Cup 2026
-
'మా టికెట్లు ఇచ్చేయండి'.. అభిమానులకు ఫిఫా అభ్యర్థన!
మరో వారం రోజుల్లో ఫిఫా వరల్డ్‌కప్‌కు తెరలేవనుంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు కొనసాగనున్న టోర్నీలో మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు సంబంధించి చాలా టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. అయితే వెబ్సైట్ పొరపాటు వల్ల చిన్న తప్పిదం జరిగిపోయింది. వెబ్సైట్లో తప్పిదం కారణంగా సుమారు 60 మంది అభిమానులు ఉచితంగా టికెట్లు పొందారు. అయితే వీటికి అభిమానులు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో ఫిఫా నిర్వాహకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వెబ్సైట్ లోపం వల్ల ఇలా జరిగిందని నిర్థారణకు వచ్చిన ఫిఫా ఆ 60 టికెట్లను వెనక్కి ఇచ్చేయాలని, వాటి స్థానంలో కొత్త టికెట్లు జారీ చేస్తామని అభిమానులను అభ్యర్థించింది. ఉచితంగా వస్తే వదలకూడదన్న సామెతను ఒంటబట్టించుకున్న అభిమానులు ఫిఫా అభ్యర్థనను పట్టించుకోలేదు. దీంతో ఫిఫా ఉన్నపళంగా ఆ టికెట్లను రద్దు చేసింది. అయితే తమ తప్పిదం వల్లే ఇలాంటి పొరపాటు జరగడంతో అసౌకర్యానికి చింతిస్తున్నామని ఫిఫా తెలిపింది. అయితే టికెట్లు రద్దు చేయాలని ముందు నిర్ణయించినప్పటికీ ఫ్యాన్స్ స్పందించడంతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే తమకు వచ్చిన టికెట్లకు ఉన్న ధర మొత్తాన్ని చెల్లిస్తే హ్యాపీగా మ్యాచ్ చూసుకోవచ్చని తెలిపింది. అయితే ప్రపంచకప్ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్లన్నీ అమ్ముడయ్యాయంటూ ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో మూడు నెలల క్రితమే ప్రకటించడం గమనార్హం. ఇక జూన్ 11 నుంచి జరగనున్న ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా డిపెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగనుంది.చదవండి: బీసీసీఐ మెచ్చిన తెలుగు క్రికెటర్.. భారత జట్టులోకి స్వాగతం! -
ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్.. విలువెంతో తెలుసా?
ప్రపంచమంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోన్న ఫిఫా ప్రపంచకప్-2026 మరో వారం రోజుల్లో మొదలుకానుంది. ఇప్పటికే ఫిఫా ప్రపంచకప్ ఆడేందుకు అన్ని జట్లు సిద్ధమయ్యాయి. భారత్‌లో క్రికెట్‌కు ఎంత ఆదరణ ఉంటుందో.. పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా యూరోప్, అమెరికా, లాటిన్ దేశాల్లో ఫుట్‌బాల్‌ను విపరీతంగా ఆదరిస్తుంటారు.అందుకే ఫిఫా ప్రపంచకప్‌కు ఎనలేని క్రేజ్ ఉంటుంది. 2022 ఫిఫా ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా డిపెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుండగా.. గతంలో ఫిఫా విజేతలుగా నిలిచిన ఫ్రాన్స్, జర్మనీ, బ్రెజిల్, ఇంగ్లండ్, స్పెయిన్లు మరోసారి ఫిఫా కప్ సొంతం చేసుకోవాలని భావిస్తుండగా, ప్రతీసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగినప్పటికీ అంచనాలు అందుకోవడంలో విఫలమవుతూ వస్తోన్న పోర్చుగల్ ఈసారి కూడా టాప్ కంటెండర్‌గా పోటీలో ఉంది. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా ప్రపంచకప్‌లో 48 దేశాలు పాల్గొంటున్నాయి. మొత్తం 108 మ్యాచ్‌లు జరగనున్న టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. విజేతగా నిలిచే జట్టుకు అందించే ట్రోఫీ విలువను సరిగ్గా అంచనా వేయలేము. అయితే ఇందులో ఉపయోగించే మెటల్స్ ఆధారంగా లెక్కిస్తే ప్రస్తుతం దీని విలువ సుమారు 2.5 లక్షల అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 2,380 కోట్ల పైమాటే.ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం, ట్రోఫీ తయారీలో అవసరమైన అత్యున్నత స్థాయి నైపుణ్యం కారణంగా దీని విలువ మరింత పెరిగింది. అయితే వాస్తవానికి ఈ ట్రోఫీ విలువ దాని తయారీ ఖర్చుతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ. ఒకవేళ ఈ ట్రోఫీని నేడు వేలానికి ఉంచితే దీని ధర 20 మిలియన్ డాలర్లకు పైగా పలికే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. భారత కరెన్సీలో ఇది రూ.170 కోట్లతో సమానం. అయితే గెలిచిన జట్టుకు అందించే ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ దేనితో తయారు చేస్తారు, ఎన్ని క్యారెట్ల బంగారాన్ని వాడుతారు? జట్టుకు అందించే ట్రోఫీ నిజమైనదా లేదా రెప్లికా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.18 క్యారెట్ల బంగారం..ఫిఫా ట్రోపీ 37 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసే ట్రోపీ ఆరు కిలోల బరువును కలిగి ఉంటుంది. ట్రోఫీ డిజైన్ లో ఇద్దరు వ్యక్తులు భూమిని పైకి ఎత్తి పట్టుకున్నట్లుగా కనిపిస్తారు. ఫుట్‌బాల్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే క్రీడ అనే సందేశాన్ని ఈ రూపకల్పన ప్రతిబింబిస్తుంది. అయితే చాలామంది అనుకునేలా ఈ ట్రోఫీ పూర్తిగా బంగారంతో తయారై ఉండదు. ట్రోఫీ లోపలి భాగం ఖాళీగా ఉంటుంది. ఒకవేళ పూర్తిగా బంగారంతో తయారు చేస్తే అది చాలా బరువుగా మారి ఆటగాళ్లు ఎత్తడం కష్టమవుతుంది. ట్రోఫీ అడుగు భాగంలో రెండు పొరల మలకైట్ అనే ఆకుపచ్చ రంగు ఖనిజాన్ని ఉపయోగించారు.బ్రెజిల్ ఖాతాలో పాతట్రోఫీ..ఈ ట్రోఫీని ఇటలీకి చెందిన శిల్పి సిల్వియో గజ్జనిగా రూపొందించారు. 1970లో ఫిఫా నిర్వహించిన అంతర్జాతీయ డిజైన్ పోటీలో ఆయన రూపకల్పన ఎంపికైంది. అంతకుముందు ఉపయోగించిన జూల్స్ రిమెట్ ట్రోఫీని 1970లో బ్రెజిల్ మూడోసారి వరల్డ్ కప్ గెలుచుకోవడంతో శాశ్వతంగా ఆ దేశానికి అప్పగించారు. దీంతో కొత్త ట్రోఫీని రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వరల్డ్ కప్ ట్రోఫీని తొలిసారిగా 1974లో పశ్చిమ జర్మనీ గెలుచుకుంది.విజేతలకు ఇచ్చేది నకిలీదేఫిఫా ప్రపంచకప్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఫైనల్ గెలిచిన జట్టుకు అసలు ట్రోఫీని శాశ్వతంగా ఇవ్వరు. ఫైనల్ ముగిసిన వెంటనే అసలు ట్రోఫీని ఫిఫా స్విట్జర్లాండ్‌లోని తమ ప్రధాన కార్యాలయం జ్యూరిచ్‌కు తిరిగి తీసుకెళ్తుంది. దాని బదులుగా విజేత దేశానికి బంగారు పూత పూసిన కాంస్యంతో తయారు చేసిన ప్రత్యేక రిప్లికా ట్రోఫీని అందజేస్తారు. దీంతో అసలు ట్రోఫీ ఎప్పటికీ ఫిఫా ఆధీనంలోనే ఉంటుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత విలువైన గుర్తింపుగా నిలిచిన ఈ ట్రోఫీపై ప్రతి నాలుగేళ్లకోసారి ప్రపంచ దేశాలు కన్నేస్తుంటాయి.చదవండి: ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్‌లీడర్స్‌తో క్రికెటర్ల బంధం! -
షకీరా కూడా పనికిరాదు.. ఫ్యాన్స్‌ను షేక్‌చేస్తోన్న ఫిఫా పాట!
ప్రపంచవ్యాప్తంగా మరో రెండు వారాల్లో ఫిఫా ప్రపంచకప్ సందడి మొదలుకానుంది. జూన్ 11 నుంచి జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌కు అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిఫా ప్రపంచకప్‌ను ప్రమోట్ చేస్తూ ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ ఐషోస్పీడ్ తన ప్రత్యేక గీతాన్ని విడుదల చేశాడు. అయితే ఐషోస్పీడ్ పాడిన పాట 24 గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే 40 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. ఇక యూట్యూబ్‌లోనూ మూడు మిలియన్లు, ఇతర ప్లాట్‌ఫామ్స్ కలిపి మరో ఏడు మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ లెక్కన ఒక్కరోజులోనే 50 మిలియన్ల వ్యూస్ సాధించడం మరో రికార్డుగా నిలిచింది. అయితే మే నెలలో కొలంబియన్ పాప్‌స్టార్ షకీరా, నైజీరియన్ ఆఫ్రోబీట్స్ ఐకాన్ బర్నాబాయ్లతో ఫిఫా నిర్వాహకులు ప్రపంచకప్ అధికారిక గీతాన్ని విడుదల చేశారు. టోర్నమెంట్ బహుళ సాంస్కృతిక స్ఫూర్తిని చాటిచెప్పేలా, విలక్షణమైన పశ్చిమ ఆఫ్రికా లయలను ఉత్సాహభ రితమైన లాటిన్ బీట్స్‌తో మేళవించేలా "డై డై" అనే ఈ ట్రాక్‌ను రూపొందించారు. కానీ ఫిఫా నిర్వాహకులు విడుదల చేసిన గీతం జనాలకు అంతగా ఎక్కలేదు. చారిత్రాత్మక ఫుట్‌బాల్ గీతాల్లో సాధారణంగా ఉండే సహజమైన, ఉత్సాహభరితమైన ట్యూన్స్ మిస్సయ్యాయని చాలా మంది అభిమానులు విమర్శించారు. కానీ ఇదే సమయంలో ఐషో స్పీడ్ విడుదల చేసిన గీతం మాత్రం అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఐషో స్పీడ్ పాడిన పాట అన్ని దేశాల సంప్రదాయాలను మేళవిస్తూ పాడడంతో 24 గంటల్లోనే వైరలయ్యి కూర్చొంది. 'ఫిఫా విడుదల చేసిన దానికంటే ఐషో స్పీడ్ పాడిన పాట మంచి కిక్ ఇస్తుందని.. ఇది కదా అసలైన ఫిఫా పాట" అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక జూన్ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లు భారత్‌లో కూడా ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించిన ప్రసార హక్కులను జీ నెట్వర్క్ మంచి ధరకు కొనుగోలు చేసింది. 2010 ఫిఫా ప్రపంచకప్ సమయంలో షకీరా పాడిన వాకా వాకా పాట ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఐషో స్పీడ్ పాడిన పాట షకీరా పాటను కూడా క్రాస్ చేసేలా కనిపిస్తోంది.🚨| BREAKING: Speed has OFFICIALLY RELEASED his World Cup song “Champions” 🤯🤯🔥 pic.twitter.com/Y7OuAweBNP— Speedy HQ (@IShowSpeedHQ) June 1, 2026చదవండి: వైభవ్ కోసం పడిగాపులు.. అస్సలు తగ్గేదేలే! -
భారత్‌లో ఫిఫా ప్రసార హక్కులు ఆ సంస్థకే!
భారత్‌లో ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్‌ల ప్రసారాలకు సంబంధించి లైన్ క్లియర్ అయింది. జూన్ 11 నుంచి జరగనున్న ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లకు సంబంధించిన ప్రసార హక్కులను జీ నెట్వర్క్ దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 2026 నుంచి 2034 వరకు ఫిఫా ప్రపంచకప్ సహా మొత్తం 39 ఫిఫా ఈవెంట్లకు సంబంధించిన మ్యాచ్‌లను ఆ చానెల్ ప్రసారం చేయనుంది. ఈ విషయాన్ని జీ ఎంటర్టైన్మెంట్ సోమవారం అధికారికంగా వెల్లడించింది. 2026 ఫిఫా ప్రపంచకప్‌తో పాటు ఫిఫా మహిళల ప్రపంచకప్ 2027, ఫిఫా ప్రపంచకప్ 2030 సహా మిగతా ఈవెంట్లకు సంబంధించిన మ్యాచ్‌లను భారత్‌లో జీ నెట్వర్క్ ప్రసారం చేయనుంది. 8 ఏళ్ల కాలానికి ఒప్పందం చేసుకోవడంతో విలువ కూడా భారీ స్థాయిలోనే ఉండనుంది. రెండు రోజుల క్రితం ఫిఫా మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించి హక్కులను జీ నెట్వర్క్ సొంతం చేసుకుందని, సదరు బ్రాడ్కాస్టర్లకు 30 నుంచి 35 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 284 నుంచి 332 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం అందింది. అయితే ఇప్పుడు ఆ సంఖ్య డబుల్ అయినట్లు తెలుస్తోంది. అంతకముందు భారత్‌లో మ్యాచ్‌ల ప్రసార హక్కుల ఒప్పందం కోసం ఫిఫా వంద మిలియన్ డాలర్లను ఆశించింది. కానీ జీ నెట్వర్క్ మంచి ధరకే ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022 ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లకు భారత్‌లో ప్రసార హక్కులను అప్పట్లో వయాకామ్ 18 (న్యూస్ 18) 62 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మొత్తంగా ఒప్పందం విలువ ఎంత అనేది పక్కనబెడితే ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్‌లో వీక్షించాలనుకున్న అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఇక ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లను జీ నెట్వర్క్ ఇటీవలే కొత్తగా లాంఛ్ చేసిన నాలుగు స్పోర్ట్స్ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. యునైట్8 స్పోర్ట్స్ 1 (హిందీ), యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డి (హిందీ), యునైట్8 స్పోర్ట్స్ 2 (ఇంగ్లీష్), యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్డి (ఇంగ్లీష్) లో మ్యాచ్‌లు ప్రసారం కానున్నాయి. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ లో మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొన్నటిదాకా ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లను వీక్షించే భాగ్యం లేకుండా పోయిందని తెగ బాధపడిపోయిన అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.భారతీయ బ్రాడ్కాస్టర్లు ఈ హక్కులను కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపకపోవడానికి 'టైమింగ్స్' ఓ పెద్ద సమస్యగా మారాయి. ఈసారి టోర్నమెంట్లో మొత్తం 104 మ్యాచ్‌లు జరుగుతుండగా.. అందులో కేవలం 14 మ్యాచ్‌లు మాత్రమే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి లోపు ప్రారంభమవుతాయి. మిగిలినవన్నీ అర్ధరాత్రి దాటాక లేదా తెల్లవారుజామున ప్రారంభం కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ కూడా అర్ధరాత్రి 12:30 గంటలకు షెడ్యూల్ చేయబడింది. పీడబ్ల్యూసీ ఇండియా మీడియా నిపుణుడు రాజేష్ సేథి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి దాటిన తర్వాత మ్యాచ్‌లు ప్రసారమైతే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోతుంది. పైగా చివరి నిమిషంలో డీల్ కుదిరితే స్పాన్సర్లను వెతుక్కోవడానికి ఛానెళ్లకు తగిన సమయం ఉండదు. జనాభా ఎక్కువగా ఉన్నంత మాత్రాన ప్రకటనకర్తలు డబ్బులు కుమ్మరించరని, వీక్షకుల సంఖ్యను బట్టే రేట్లు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.చదవండి: ఆ విషయంలో గిల్ తోపు.. రబాడ తక్కువేం కాదు! -
అభిమానులకు గుడ్‌న్యూస్.. కానీ 332 కోట్ల మెలిక!
భారత్‌లో ఫుటబాల్కు ఆదరణ తక్కువే అయినప్పటికీ.. బెంగాల్, కేరళ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఫుట్‌బాల్ ఆటకు యమ క్రేజ్ ఉంటుంది. భారత్‌లో కూడా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పేరిట ఫుట్‌బాల్ టోర్నీలు నిర్వహిస్తుండడంతో ఆదరణ పెరుగుతున్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఫిఫా వరల్డ్‌కప్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ మ్యాచ్‌లు లైవ్‌లో వీక్షించాలని ప్రతీ దేశం భావిస్తోంది. అయితే భారత్‌లో మాత్రం మొన్నటిదాకా ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లను లైవ్‌లో వీక్షించే అవకాశం లేకుండేది. అయితే తాజాగా భారత ఫుట్‌బాల్ అభిమానులకు ఒక గుడ్‌న్యూస్. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేసేందుకు జీ నెట్వర్క్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా దాదాపు పూర్తయింది. మరో 24-48 గంటల్లో ఒక ప్రకటన కూడా విడుదల కానుంది. అయితే ఫిఫా మ్యాచ్‌ల ప్రసార హక్కుల్ని జీ నెట్వర్క్ పొందాలనుకుంటే సదరు ఫిఫా బ్రాడ్కాస్టర్లకు 30 నుంచి 35 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ. 284 నుంచి 332 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారీ మొత్తం కావడంతో జీ నెట్వర్క్ వెనుకడుగు వేసినప్పటికీ చర్చలు నడుస్తున్నాయి. అయితే జీతో పాటు సోని పిక్చర్స్ నెట్వర్క్ కూడా ప్రసార హక్కులను దక్కించుకునేందుకు పోటీలో ఉంది. అయితే సోనీ నెట్వర్క్ మాత్రం బిడ్ దాఖలు చేయలేదు. దీంతో ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను జీ నెట్వర్క్ సొంతం చేసుకోవడం లాంఛనమే అని చెప్పొచ్చు. ఇక జీ నెట్వర్క్ కొత్తగా నాలుగు స్పోర్ట్స్ చానెల్లను లాంచ్ చేసింది. యునైటెడ్ స్పోర్ట్స్ 1, యునైట్ 8 స్పోర్ట్స్ హెచ్డీ (హిందీ), యునైట్ 8 స్పోర్ట్స్ 2 (ఇంగ్లీష్), యునైట్ 8 స్పోర్ట్స్ హెచ్డీ (ఇంగ్లీష్) లాంచ్ చేసింది. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ లో మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఒప్పందం ఖరారైతే మాత్రం ఈ మ్యాచ్‌లన్నింటి నాలుగు చానెల్స్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. మొత్తంగా మొన్నటిదాకా ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లను వీక్షించే భాగ్యం లేకుండా పోయిందని తెగ బాధపడిపోయిన అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.చదవండి: ‘నువ్వొక అద్భుతం’.. థాంక్యూ వైభవ్ సూర్యవంశీ! -
మెస్సీ ఆడడంపై క్లారిటీ.. అర్జెంటీనా జట్టు ప్రకటన
జూన్ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ టోర్నీ కోసం అర్జెంటీనా శుక్రవారం తమ జట్టును ప్రకటించింది. 2022లో ఫిఫా చాంపియన్‌గా నిలిచిన అర్జెంటీనాను మళ్లీ మెస్సీనే నడిపించనున్నాడు. 26 మంది సభ్యులతో కూడిన బృందాన్ని అర్జెంటీనా జట్టు కోచ్ లియోనిల్ స్కలోని ప్రకటించారు. ఇటీవలే ఇంటర్ మియామి క్లబ్ తరఫున మ్యాచ్ ఆడుతూ మెస్సీ గాయపడిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా అతడు ఫిఫా వరల్డ్‌కప్‌కు దూరమవనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు తెరదించుతూ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆడనున్నట్లు, జట్టుకు సారథిగా అతనే వ్యవహరించనున్నట్లు స్కలోని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మెస్సీ రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ప్రపంచకప్ ఆడనున్నాడు. ఎనిమిది సార్లు బాలన్ డీ ఓర్ అవార్డు గెలిచిన మెస్సీకే సారధ్య బాధ్యతలను అప్పగించారు. ఖతార్‌లో నాలుగేళ్ల క్రితం జరిగిన వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా టైటిల్‌ను గెలిచిన విషయం తెలిసిందే. అయితే అర్జెంటీనా జట్టులో రియల్ మాడ్రిడ్ ప్లేయర్ ఫ్రాంకో మస్తానటునో పేరు మాత్రం జట్టులో కనిపించలేదు. జూన్ 11న మొదలుకానున్న ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. గ్రూప్ జెలో ఉన్న అర్జెంటీనా తమ తొలి మ్యాచ్‌ను కన్సాస్ సిటీ వేదికగా జూన్ 17న అల్జీరియాతో ఆడనుంది. అర్జెంటీనాతో పాటు అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్లు గ్రూప్-జెలో ఉన్నాయి. అర్జెంటీనా జట్టు:గోల్‌కీపర్స్: ఎమిలియానో మార్టినేజ్, జిరోనిమా రుల్లి, జువాన్ ముసోడిఫెండర్స్: గొంజాలో మాంటిల్, నాహుల్ మోలినా, లిసాండ్రో మార్టినేట్, నికోలస్ ఒటమెండి, లియోనార్డో బార్లేడి, క్రిస్టియానా రొమారియో, ఫకుండా మెదీనా, నికోలస్ తగ్లియాఫికోమిడ్ఫీల్డర్లు: లియాండ్రో పరేడ్స్, రోడ్రిగో డీ పాల్, ఎక్స్కుయల్ పాలేసియస్, ఎంజో ఫెర్నాండేజ్, అలెక్సిస్ మాక్ అలిస్టర్, జియోవాని లో సెల్సో, వాలెంటినా బార్కోస్ట్రైకర్లు: లియోనిల్ మెస్సి (కెప్టెన్) , నికోలస్ పాజ్, థియాగో అల్మడా, నికోలస్ గొంజాలెజ్, జులియన్ అల్వరేజ్, గులియానో సిమోని, లౌతారో మార్టినేజ్, జోస్ మాన్యువెల్ లోపేజ్చదవండి: ‘అఫ్రిదితో పోలిక.. ఇది అవమానించడమే!’ -
మూణ్ణెళ్ల కింద రాజీనామా.. ఇప్పుడు రికార్డు పుటల్లోకి!
కేవలం 1,56,000 జనాభా ఉన్న కురసావ్ దేశం వచ్చే నెలలో చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. 96 ఏళ్ల ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో ఆడనున్న అతిచిన్న దేశంగా (జనాభా, వైశాల్యం పరంగా) కురసావ్ జట్టు గుర్తింపు పొందనుంది. ఈ జట్టుగా హెడ్ కోచ్‌గా ఉన్న డిక్ అడ్వోకాట్ కూడా రికార్డు నెలకొల్పనున్నాడు. ప్రపంచకప్ చరిత్రలోనే ఒక జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్న అతిపెద్ద వయస్కుడిగా 78 ఏళ్ల అడ్వోకాట్ (Dick Advocaat) గుర్తింపు పొందనున్నాడు. గతంలో ఈ రికార్డు ఒట్టో రెహగల్ పేరిట ఉంది. 2010 ప్రపంచకప్‌లో గ్రీస్ జట్టుకు రెహగల్ హెడ్ కోచ్‌గా ఉన్నపుడు ఆయన వయస్సు 71 ఏళ్లు. గ్రూప్ ‘ఇ’లో ఉన్న కురసావ్ జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూన్ 14న హ్యూస్టన్‌లో జర్మనీ జట్టుతో ఆడనుంది. నెదర్లాండ్స్‌కు చెందిన అడ్వోకాట్ శిక్షణలోనే కురసావ్ దేశం మొదటిసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించింది. రెండేళ్లపాటు కురసావ్ జట్టుకు కోచ్‌గా ఉన్న అడ్వోకాట్ మూడు నెలల క్రితం కుటుంబకారణాలరీత్యా తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. ఈ మూడు నెలల కాలంలో కురసావ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన ఫ్రెడ్ రుటెన్ ఆధ్వర్యంలో ఆశించిన ఫలితాలు రాలేదు. చైనా, ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో కురసావ్ ఓడిపోయింది. కురసావ్ జట్టులోని సీనియర్ ప్లేయర్లకు కూడా రుటెన్ శిక్షణ పద్ధతులు నచ్చలేదు. సీనియర్ ప్లేయర్లందరూ మళ్లీ అడ్వోకాట్‌ను కోచ్‌గా తేవాలని కురసావ్ ఫుట్‌బాల్ సమాఖ్యను కోరారు. దాంతో కురసావ్ సమాఖ్య... అడ్వోకాట్‌ను సంప్రదించగా ఆయన కోచ్‌గా మళ్లీ వచ్చేందుకు అంగీకరించారు. ఫుట్‌బాల్ సర్కిల్లో ‘ద లిటిల్ జనరల్’గా పేరున్న అడ్వోకాట్‌కు అంతర్జాతీయంగా మంచి పేరుంది. హెడ్ కోచ్‌గా అడ్వోకాట్‌కిది మూడో ప్రపంచకప్ కానుంది. 1994లో నెదర్లాండ్స్ జట్టుకు... 2006లో దక్షిణ కొరియా జట్టుకు ఆయన కోచ్‌గా ఉన్నారు. అంతేకాకుండా బెల్జియం, యూఏఈ, రష్యా, సెర్బియా, ఇరాక్ జట్లకు, 16 ప్రొఫెషనల్ క్లబ్ జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. -
‘ఎల్లో’ కార్డులపై సడలింపులు!
వాషింగ్టన్: రాబోయే ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లు అనూహ్యంగా కీలక మ్యాచ్‌లకు దూరం కాకూడదని భావిస్తున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) క్రమశిక్షణకు సంబంధించి పలు కొత్త నిబంధనలను తీసుకొచి్చంది. ఆటగాళ్లకు ‘ఎల్లో’ కార్డులు జారీ చేయడం, దానికి సంబంధించి శిక్షను అమలు చేసే విషయంలో సడలింపు ఇచ్చింది. సాధారణంగా వరుసగా రెండు ఎల్లో కార్డులు జారీ అయితే ఆ ఆటగాడు తర్వాతి మ్యాచ్‌లో ఆడకుండా సస్పెన్షన్ విధిస్తారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనన ప్రకారం టోరీ్నలో ఎల్లో కార్డుకు గురైనా సరే... నాకౌట్ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. రెండుసార్లు ఎల్లో కార్డు రికార్డును అధికారులు తొలగిస్తారు. అంటే గ్రూప్ మ్యాచ్‌లలో ఎల్లో కార్డు అందుకున్నా... నాకౌట్‌కు ముందు దానిని పరిగణనలోకి తీసుకోరు. ఫలితంగా అతనిపై నిషేధం ఉండదు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తర్వాత కూడా ఇదే తరహాలో గత రికార్డును పక్కన పెట్టి కొత్తగా మొదలు పెట్టే అవకాశం ఇస్తారు. అంటే ఒకవేళ క్వార్టర్ ఫైనల్లో రెండో ఎల్లో కార్డులను ఎదుర్కొన్నా అతను సెమీస్ ఆడటంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కీలక మ్యాచ్‌లకు టాప్ ప్లేయర్లు దూరం కాకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని ‘ఫిఫా’ అభిప్రాయ పడింది. మరోవైపు కొందరు ఆటగాళ్లు తమ నోటిపై చేతిని అడ్డుగా పెట్టుకొని ప్రత్యర్థి ఆటగాళ్లను దూషిస్తున్నారు. దీనిని నివారించేందుకు కూడా ‘ఫిఫా’ కొత్త నిబంధన తెచి్చంది. ఇకపై ఇలా నోటికి చేతిని అడ్డుగా పెట్టి గొడవకు దిగితే అతనికి రిఫరీ ఏకంగా ‘రెడ్ కార్డు’ జారీ చేయవచ్చు. -
సాకర్ సంగ్రామం ముంగిట అభిమానులకు షాక్!
మరో రెండు నెలల్లో సాకర్ మహాసంగ్రామం మొదలుకానుంది. జూన్ 11 నుంచి ఫిఫా ప్రపంచకప్ ప్రారంభం కానుండడంతో టోర్నీకి సంబంధించి పాల్గొనబోయే జట్లు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను ఇప్పటికే ఫిఫా సమాఖ్య విడుదల చేసింది. అయితే ఫుట్‌బాల్ ఆటను మైదానంలో వీక్షిస్తే వచ్చే మజానే వేరు. 90 నిమిషాల్లో ముగిసిపోయే మ్యాచ్ చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తుం టారు. సాకర్ ఫీవర్ ఉన్నన్నాళ్లు స్టేడియాలన్నీ ప్రేక్షకులతో కిక్కిరిసిపోవడం ఖాయం. కానీ 2026 ఫిఫా ప్రపంచకప్‌కు సంబంధించి టికెట్ల ధరల విషయం మాత్రం ఒక ఆందోళన కలిగిస్తోంది. ఈసారి టికెట్ రేట్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో సాధారణ అభిమానులకు మ్యాచ్ వీక్షించడం సాధ్యమయ్యేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఏడాది ప్రపంచ కప్ టికెట్ల ధరలను ఫిఫా భారీగా పెంచేసింది. ఇప్పటికే ఉన్న కేటగిరీలకు తోడు కొత్తగా ‘ఫ్రంట్ కేటగిరీ’ పేరుతో మరింత ఖరీదైన టిక్కెట్లను ప్రవేశపెట్టింది. దీంతో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించడం సాధారణ అభిమానులకు ఖరీదైన వ్యవహారంగా మారనుంది. జూన్ 12న అమెరికాలోని ఇంగిల్‌వుడ్‌లో జరిగే అమెరికా ఆరంభ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ముందువరుసలోని ‘ఫ్రంట్ కేటగిరీ’ ఒక టికెట్ ధర 4,105 డాలర్లుగా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.3.4 లక్షలు . గతంలో ఇదే కేటగిరీ గరిష్ట ధర 2,735 డాలర్లు (సుమారు రూ.2.25 లక్షలు)గా ఉండేది. ఇప్పుడు కొత్త కేటగిరీలతో ధరలు మరింత పెరిగాయి.అదేవిధంగా, ఫీఫా కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఫ్రంట్ కేటగిరీ 2’టికెట్ల ధరలు 1,940 నుంచి 2,330 డాలర్ల వరకు ఉన్నాయి. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.1.6 లక్షల నుంచి రూ.1.9 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కెనడా ఆరంభ మ్యాచ్‌కు కూడా ఫ్రంట్ కేటగిరీ ఒక టికెట్ ధర 3,360 (సుమారు రూ.2.8 లక్షలు)గా నిర్ణయించారు. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌కు కూడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఫిలడెల్ఫియాలో జరిగే మ్యాచ్‌కు టికెట్ ధర 905 డాలర్లు (సుమారు రూ.75,000)గా ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే, టికెట్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.న్యూజెర్సీలోని మెట్అఫ్ స్టేడియంలో జూలై 19న జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్ గరిష్ట ధర 10,990 డాలర్లుగా నిర్ణయించగా, ఇది భారత కరెన్సీలో సుమారు రూ.9 లక్షలకు పైగా ఉంటుంది. డిసెంబర్ లో ఇదే టికెట్ ధర 8,680 డాలర్లు (సుమారు రూ.7.20 లక్షలు)గా ఉండేది. అదే విధంగా, కేటగిరీ 2 టికెట్లు 5,575 నుంచి 7,380 డాలర్లు (రూ.4.6 లక్షలు – రూ.6.1 లక్షలు), కేటగిరీ 3 టికెట్లు 4,185 నుంచి 5,785 డాలర్లు (రూ.3.5 లక్షలు - రూ.4.8 లక్షలు) వరకు పెరిగాయి. మొత్తం మీద యుద్ధం ప్రభావం, ఆర్థిక అనిశ్చితి ఫిఫా ప్రపంచకప్ టికెట్ ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రీమియం అనుభవం పేరుతో ఫిఫా కొత్త కేటగిరీలను తీసుకువచ్చినప్పటికీ, సాధారణ అభిమానులకు మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించడం కష్టతరంగా మారింది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.చదవండి: ‘అడ్డుగోడలా నిలబడితే విజయం ఎలా వస్తుంది?’ -
ఫ్యాన్స్‌కు షాక్.. ఒక్కో టిక్కెట్ ధర రూ. 10 లక్షలు!
అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఫిఫా ప్రపంచకప్-2026కు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మొత్తం 48 జట్లు పాల్గొనున్నాయి. కాగా ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన టికెట్ ధరలు టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.లాస్ట్-మినిట్ సేల్స్ ఫేజ్ పేరిట టికెట్ల విక్రయాలు బుధవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే ఫైనల్ మ్యాచ్ టాప్ కేటగిరీ టికెట్ ధరను ఫిఫా ఏకంగా 10,990 డాలర్లకు (సుమారురూ.9.16 లక్షలు) పెంచింది. గత డిసెంబర్లో టోర్నమెంట్ డ్రా సమయంలో ఇదే టికెట్ ధర 8,680 డాలర్లుగా ఉండేది. మెక్సికో సిటీలో జరిగే ప్రారంభ మ్యాచ్ టికెట్ ధర 2,355 డాలర్ల నుండి 2,985 డాలర్లకు పెరిగింది. కాగా ఫిఫా ఈసారి 'డైనమిక్ ప్రైసింగ్' విధానాన్ని అమలు చేస్తోంది. అంటే డిమాండ్‌ను బట్టి టికెట్ ధరలు మారుతూ ఉంటాయి. ఇదే విధానం విమానం టికెట్ల బుకింగ్‌లో కూడా ఉంటుంది. అయితే ఫిఫా అనుసరిస్తున్న ఈ ధరల విధానంపై అమెరికా కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు."ఫిఫా ప్రపంచకప్-2026 కోసం 'డైనమిక్ ప్రైసింగ్' విధానాన్ని అమలు చేయడం సరికాదు. ఇది సామాన్య సాకర్ అభిమానులను క్రీడకు దూరం చేస్తుంది" అని 69 మంది డెమొక్రాటిక్ సభ్యులు ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినోకు లేఖ రాశారు. ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లు ఇవే?గ్రూప్ ఎ – మెక్సికో, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, చెకియాగ్రూప్ బి – కెనడా, బోస్నియా మరియు హెర్జెగోవినా, ఖతార్, స్విట్జర్లాండ్గ్రూప్ సి – బ్రెజిల్, మొరాకో, హైతీ, స్కాట్లాండ్గ్రూప్ డి – యుఎస్ఎ, పరాగ్వే, ఆస్ట్రేలియా, టర్కీగ్రూప్ ఇ – జర్మనీ, కురసావో, ఐవరీ కోస్ట్, ఈక్వెడార్గ్రూప్ ఎఫ్ – నెదర్లాండ్స్, జపాన్, స్వీడన్, ట్యునీషియాగ్రూప్ జి – బెల్జియం, ఈజిప్ట్, ఇరాన్, న్యూజిలాండ్గ్రూప్ హెచ్ – స్పెయిన్, కేప్ వెర్డే, సౌదీ అరేబియా, ఉరుగ్వేగ్రూప్ ఐ – ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్/బొలీవియాగ్రూప్ జె – అర్జెంటీనా, అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్గ్రూప్ కె – పోర్చుగల్, డిఆర్ కాంగో, ఉజ్బెకిస్తాన్, కొలంబియాగ్రూప్ ఎల్ – ఇంగ్లాండ్, క్రొయేషియా, ఘానా, పనామాచదవండి: IPL 2026: పాపం అర్జున్ టెండూల్కర్.. జట్టు మారినా? -
కంటతడి పెట్టిన లియోనల్ మెస్సీ!
లియోనల్ మెస్సీ.. పరిచయం అక్కర్లేని పేరు. ఈతరం ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఆల్ టైమ్ గ్రేట్‌గా ఈ అర్జెంటీనా స్టార్‌ను అభివర్ణిస్తుంటారు. ఆయన అభిమాన బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం మెస్సీ వయస్సు 38 ఏళ్లు కావడంతో అతడి రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్‌లో మొదలుకానున్న ఫిఫా ప్రపంచకప్ 2026 మెస్సీ ఆఖరి టోర్నీ అని ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడడంతో మెస్సీ ఉద్వేగానికి గురయ్యాడు. విషయంలోకి వెళితే మంగళవారం రాత్రి బ్యూనస్ఎయిర్స్ వేదికగా అర్జెంటీనా, జాంబియా మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా ఒక గోల్ కొట్టడంతో పాటు మరొక గోల్ కొట్టడంలో అసిస్ట్ చేశాడు. మ్యాచ్‌లో అర్జెంటీనా 5-0తో జాంబియాను చిత్తుగా ఓడించింది. తొలి హాఫ్ ముగియడానికి ముందు కెరీర్లో 116వ గోల్ సాధించిన మెస్సీ అంతకముందు మ్యాచ్ ఆరంభంలో జులియన్ అల్వారెజ్‌కు పాస్ అందించాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత తన సహచరులతో కలిసి మైదానంలో నిలబడిన సమయంలో స్టాండ్స్‌లోని ప్రేక్షకులు ‘మెస్సీ.. మెస్సీ’ అంటూ అరవడం మొదలెట్టారు. ఇది చూసిన మెస్సీ కళ్లలో దుఃఖం ఆగలేదు. వెంటనే తలను కిందకు దించి కంటి నుంచి వచ్చిన నీరును తుడుచుకోవడం కెమెరాలకు చిక్కింది. అర్జెంటీనా తరఫున తన హోంగ్రౌండ్లో చివరి మ్యాచ్ ఆడడాన్ని జీర్ణించుకోలేకే మెస్సీ కంటతడి పెట్టినట్లు అభిమానులు కామెంట్ చేశారు. ఇక ఫిఫా ప్రపంచకప్‌కు ఇప్పటికే అర్హత సాధించిన అర్జెంటీనా గ్రూప్-జేలో ఉంది. ఇదే గ్రూప్‌లో ఉన్న అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్లతో అర్జెంటీనా మ్యాచ్‌లు ఆడనుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న అర్జెంటీనాకు గ్రూప్ దశలో సులువైన డ్రానే లభించింది. ప్రపంచకప్‌కు సన్నాహకంగా అర్జెంటీనా వరుస ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడుతూ వస్తోంది. ఇప్పటికే మారిటానియా, జాంబియాలతో మ్యాచ్‌లు ముగించుకున్న అర్జెంటీనా తమ తదుపరి మ్యాచ్‌ను సెర్బియాతో ఆడనుంది.2022లో అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌కప్ సాధించడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు. ఆ ప్రపంచకప్‌లో నాయకుడిగా, ఆటగాడిగా జట్టును నడిపించిన మెస్సీ ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో రెండు గోల్స్ కొట్టడమే గాక, టోర్నీ మొత్తంగా ఏడు గోల్స్ కొట్టి ‘గోల్డెన్ బాల్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన మెస్సీ ఆ జట్టు దిగ్గజ కెప్టెన్లు డానియెల్ పసరెల్లా, డీగో మారడోనా సరసన చోటు దక్కించుకున్నాడు. LIONEL MESSI GOAL FOR ARGENTINA 🐐🇦🇷 pic.twitter.com/9jxqpLWeSc— Ayuba | Football News (@ayubafootball) April 1, 20262005లో అర్జెంటీనా జాతీయ జట్టులోకి వచ్చిన మెస్సీ ఇప్పటివరకు 198 మ్యాచ్‌ల్లో 116 గోల్స్ సాధించాడు. చివరగా మెస్సీ సారథ్యంలో 2024లో మినీ ప్రపంచకప్‌గా పిలుచుకునే కోపా అమెరికా కప్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. తాజాగా మరోసారి కోచ్ లియోనెల్ స్కలోని మార్గదర్శకత్వంలో మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రపంచ కప్‌లో మెస్సికి ఆడాలనే ఉన్నప్పటికీ కోచ్, బోర్డు తీసుకునే నిర్ణయంపై సందిగ్ధం నెలకొంది. ఇక ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఫిఫా వరల్డ్‌కప్ జరగనుంది.🚨💣 Deeply emotional scenes unfolding in Argentina 🇦🇷🥹Lionel Messi is currently playing what is expected to be his LAST match with the national team on Argentine soil.The final chapter at home for the greatest of all time before the 2026 World Cup. This one really hurts.… pic.twitter.com/yW8WaYYxyi— Topskills Sports UK (@topskillsportuk) April 1, 2026చదవండి: ‘స్నేహితుల్లేరు.. మా నాన్న ఫేవరెట్ క్రికెటర్ కాదు’ -
ఇటలీకి షాక్.. ఫిపా ప్రపంచకప్‌కు అనర్హత
ఫుట్‌బాల్‌లో ఇటలీ జట్టుది చెరగని ప్రస్థానం. నాలుగుసార్లు (1934,1938,1982,2006 ) ఫిఫా చాంపియన్‌గా నిలిచిన ఇటలీ మరో రెండుసార్లు యూరోపియన్ చాంపియన్‌గా (1968,2020) అవతరించింది. గియాన్లుగీ బఫన్, పాలో మల్దిని, రాబర్టో బగ్గియో, ఫాఇయో కన్నావరో, ఫ్రానెస్కో టొట్టి, ఆండ్రియా పిర్లో, లుగీ రివా, గిసెప్పీ మియాజ్జా వంటి స్టార్ దిగ్గజ ఆటగాళ్లు ఇటలీకి ప్రాతినిధ్యం వహించారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు మాత్రం ఇటలీ ఫుట్‌బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో ఇటలీ విఫలమైంది. మంగళవారం ఫిఫా క్వాలియర్స్ ప్లేఆఫ్స్ ఫైనల్లో బోస్నియాతో జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. అయితే పెనాల్టీ షూటౌట్లో ఇటలీ 1-4 తేడాతో బోస్నియా చేతిలో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో నాలుగుసార్లు ఫిఫా చాంపియన్ అయిన ఇటలీ వరుసగా మూడోసారి (2018, 2022, 2026) ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించని తొలి జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. అంతేకాదు 2006లో చివరిసారి ఫిఫా చాంపియన్‌గా నిలిచిన ఇటలీ అప్పటి నుంచి ఒక్క నాకౌట్ మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయింది. మరోవైపు బోస్నియా జట్టు ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించడం ఇది రెండోసారి.అయితే క్రికెట్లో ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఇటలీ తొలిసారి పాల్గొంది. ఆడుతుంది తొలి ప్రపంచకప్ అయినప్పటికీ తమ కంటే ఎన్నోరేట్లు మెరుగైన నేపాల్‌ను ఓడించి తొలి విజయాన్ని అందుకుంది. క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న ఇటలీ ఫుట్‌బాల్ ఆటలో మాత్రం తిరోగమనం దిశగా పయనిస్తోంది. నిరసనలు..ఇటలీ ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించకపోవడంతో ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. నాలుగుసార్లు ఫిఫా విజేత అయిన ఇటలీ వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటలీ ఓటమిని తట్టుకోలేక కొంతమంది కన్నీటి పర్యంతమవ్వగా, మరికొందరు మాత్రం ఇటలీ ఫుట్‌బాల్ క్లబ్ అసోసియేషన్ వద్దకు చేరుకొని నిరసనలు చేపట్టారు.🇧🇦: ✅✅✅✅🇮🇹: ❌✅❌BOSNIA BEAT ITALY ON PENALTIES AND WILL PLAY AT THE 2026 @FIFAWorldCup 🎉#WCQ | #EuropeanQualifiers pic.twitter.com/pgfeHWkENU— beIN SPORTS (@beINSPORTS_EN) March 31, 2026చదవండి: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ కూపర్! -
ఇరాన్‌కు షాకిచ్చిన ఫిఫా!
ఫిఫా ప్రపంచకప్ 2026లో తమ మ్యాచ్ వేదికలను అమెరికా నుంచి మెక్సికోకు తరలించాలని ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య చేసిన విజ్ఞప్తిని ఫిఫా (అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఫెడరేషన్ సమాఖ్య) తోసి పుచ్చింది. ఇప్పటికే మ్యాచ్ వేదికలను సిద్ధం చేశామని, ముందు అనుకున్న ప్రకారమే షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఫిఫా అధ్యక్షుడు గియాన్ని ఇన్ఫాంటియానో తెలిపారు. ఇరాన్ అభ్యర్థన సహా పలు అంశాలను పరిశీలించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిఫా పాలకమండలి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గియాన్ని వెల్లడించారు. అంతేకాదు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా సభ్య సమాఖ్య చేసిన ఫిర్యాదులపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోవడం లేదని ఫిఫా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ‘గత డిసెంబర్లోనే ఫిఫా మ్యాచ్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల చేశాము. దీంతో మ్యాచ్ వేదికలను మెక్సికోకు మార్చాలన్న ఇరాన్ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం. ఇప్పటికిప్పుడు ఇరాన్ మ్యాచ్ వేదికలను మార్చలేము. అందుకే షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లను నిర్వహించాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇజ్రాయెల్ ఫుట్‌బాల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న పాలస్తీనా ప్రతిపాదనను కూడా తిరస్కరిస్తున్నాం. భౌగోళిక రాజకీయాలను పరిష్కరించేందుకు ఫిఫా పనిచేయదు. కాకపోతే యుద్ధాన్ని ముగించి శాంతి చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలనే విషయానికి ఫిఫా కట్టుబడి ఉంటుంది.’ అని తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికాల మధ్య మొదలైన యుద్ధం మూడు వారాలు గడుస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంతో పశ్చిమాసియా అతలాకుతలమవుతోంది. అయితే సాకర్ ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్ యుద్ధానికి రెండు నెలల ముందే విడుదలయ్యింది. అమెరికా, కెనెడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్ జూన్ 11న ప్రారంభమై జూలై 19 వరకు కొనసాగనుంది. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్.. బెల్జియం,న్యూజిలాండ్, ఈజిప్ట్‌లతో తమ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే ఇరాన్ తన మూడు మ్యాచ్‌లను అమెరికాలోనే ఆడాల్సి ఉండగా.. లాస్ఏంజిల్స్ వేదికగా రెండు, మరో మ్యాచ్‌ను సియాటెల్‌లో ఆడాల్సి ఉంది. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ తమ లీగ్ మ్యాచ్‌లను అమెరికా నుంచి మెక్సికోకు తరలించాలని ఫిఫాను విజ్ఞప్తి చేసింది. తాజాగా ఫిఫా నిర్ణయం ఇరాన్‌ను చిక్కుల్లో పడేసినట్లయింది. ఇప్పుడు ఇరాన్ ముందు రెండే ఆప్షన్లు.. ఆడడం లేదా టోర్నీ నుంచి వైదొలగడం. అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్ ఫిఫా ప్రపంచకప్‌ను బహిష్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.చదవండి: అదరగొట్టిన ఓపెనర్.. కివీస్ ఘన విజయం -
LA Olympics 2028: 4 రోజుల ముందే పోటీలు షురూ
లాస్ ఏంజెలిస్: మరో రెండేళ్లలో లాస్ ఏంజెలిస్‌లో జరగబోయే 2028 ఒలింపిక్స్‌లో ఆరంభోత్సవానికి ముందే ఫుట్‌బాల్ పోటీలు మొదలు కానున్నాయి. అమెరికాలోని ఏడు నగరాల్లోని మైదానాల్లో పోటీలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. విశ్వక్రీడల వేడుకలకు ముందే పోటీలు నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది.ఈ ముందస్తు నిర్వహణతో లీగ్ దశ, నాకౌట్ దశ ఇలా మ్యాచ్ మ్యాచ్‌కు మధ్య కావాల్సినంత విశ్రాంతి లభిస్తుందని ఫుట్‌బాల్ వర్గాలు పేర్కొంటున్నాయి. 2028, జూలై 10న లీగ్ దశ మ్యాచ్‌లు మొదలవుతాయి. అనంతరం న్యూయార్క్ సహా కొలంబస్, ఒహాయో, నష్విల్లే, టెన్నెస్సీ, సెయింట్ లూసియాల్లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.మిగతా నాకౌట్ పోటీలు కాలిఫోర్నియాలో, ఫైనల్ పోరు చారిత్రక రోజ్ బౌల్ స్టేడియంలో జరుగనుంది. ఈ రోజ్‌బౌల్ వేదికపైనే 1984 ఒలింపిక్ స్వర్ణ పతక పోరు జరిగింది. అనంతరం 1994 పురుషుల ప్రపంచకప్ ఫైనల్, 1999 మహిళల ప్రపంచకప్ టైటిల్ పోరు కూడా జరిగాయి. మెక్సికోలో ఇరాన్ మ్యాచ్‌లు? మెక్సికో సిటీ: ఈ ఏడాది ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీని అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా నిర్వహించనున్నాయి. అయితే ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధకాండతో అమెరికాలో ఇరాన్ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదని ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో అమెరికాలో నిర్వహించాల్సిన ఇరాన్ మ్యాచ్‌ల్ని మెక్సికోకు తరలించాల్సిందిగా ‘ఫిఫా’తో చర్చలు జరుపుతోంది. ఈ మేరకు మెక్సికోలోని ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘ఫిఫా’ మాత్రం ఈ సంప్రదింపులపై తక్షణం స్పందించేందుకు నిరాకరించింది. -
ఇరాన్ అభ్యర్థనతో చిక్కుల్లో ఫిఫా!
పశ్చిమాసియాలో భీకరయుద్ధం నేపథ్యంలో ఇరాన్ జట్టు జూన్‌లో జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనాలా వద్దా అనే సంశయంలో ఉంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న 2026 ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే వరల్డ్‌కప్ ఆడేందుకు ఇరాన్ మా దేశంలో అడుగుపెడితే ఆ దేశ ఆటగాళ్లకు తాము భద్రత కల్పించలేమని, కాబట్టి ఇరాన్ ప్రపంచకప్ నుంచి వైదొలగడమే మంచిదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేశారు. అయితే ట్రంప్ కంటే ముందే అమెరికాలో వరల్డ్‌కప్ ఆడబోయేది లేదని ఇరాన్ ముందే భీష్ముంచుకుంది. తాజాగా ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ముందస్తుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అమెరికాలో తాము ఆడాల్సిన మ్యాచ్‌లను మెక్సికోకు తరలించాలని ఇరాన్ ఫిఫా సమాఖ్యకు అర్జీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. యుద్ధం సమయంలో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని, ఏక్షణం ఏమైనా జరిగే అవకాశముంటుందని, అందుకే మా మ్యాచ్‌లను అమెరికా నుంచి మెక్సికో లేదా కెనడాకు మార్చాలని ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా సమాఖ్యను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్ ప్రతిపాదనపై ఫిఫా సమాఖ్య ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇరాన్ ప్రతిపాదనకు అంగీకరిస్తూ మ్యాచ్ వేదికలను మార్చాలా లేక ఇరాన్ స్థానంలో వేరే జట్టుకు అవకాశమివ్వాలా అన్నది ఆలోచిస్తుంది. ఇదంతా గమనించిన క్రీడాభిమానులు ఇరాన్ ప్రతిపాదనను క్రికెట్ టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన అభ్యర్థనతో పోలుస్తున్నారు. 2026 టీ20 ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్‌కు భారత్‌తో సంబంధాలు సఖ్యతగా లేవు. అప్పటికే బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడికిపోయింది. దీంతో భారత్‌లో తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు పొంచి ఉందని ఈ కారణంగా భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడలేమని, తమ మ్యాచ్ వేదికలను లంకకు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు ప్రతిపాదనలు చేసింది. కానీ ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లకుండా తాము చూసుకుంటామని తెలిపిన ఐసీసీ వేదికలను మార్చే ప్రసక్తే లేదని బంగ్లా క్రికెట్ బోర్డుకు తేల్చి చెప్పింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు మూర్కత్వానికి పోయి టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించింది. తాజాగా అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్ పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. అమెరికాలో ఆడబోమని ఇప్పటికే స్పష్టం చేసిన ఇరాన్ .. ఫిఫా సమాఖ్య వారి ప్రతిపాదనకు అంగీకరిస్తే తప్ప ఈసారి సాకర్ ప్రపంచకప్‌లో వారి ఆటను చూడలేమనుకుంటా!చదవండి: ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్ -
ట్రంప్‌పై నిషేధం యోచనలో ఫిఫా!
పశ్చిమాసియాలోని ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగలనుంది. ప్రపంచక ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) ఆయనపై నిషేధం విధించాలనే ఆలోచనతో ఉంది. పిఫా వరల్డ్‌కప్ పోటీలతో పాటు లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028కు హాజరవ్వకుండా ట్రంప్‌పై నిషేధం పడే అవకాశముంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోవడమే అందుకు కారణమని సమాచారం. గత కొన్నేళ్లుగా యూఎస్ఏ ప్రభుత్వానికి, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు పొసగడం లేదు. దాంతో.. మూడేళ్ల నుంచి వాడాకు యూఎస్ ప్రభుత్వం ఒక్క డాలర్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం యూఎస్ఏ చెల్లించాల్సిన బకాయిల మొత్తం 7.3 మిలియన్ డాలర్ల(రూ.67 కోట్లకు పైగా)గా ఉన్నాయి. దాంతో.. వాడాకు బాకీపడిన దేశాలకు చెందిన అధ్యక్షులను, ప్రతినిధులను ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ వంటి ప్రధాన క్రీడలకు, స్పోర్ట్స్ ఈవెంట్లకు అనుమతించకూడదనే ప్రతిపాదన ఉంది. కాబట్టి.. ఫిఫా వరల్డ్‌కప్‌తో పాటు లాస్ ఎంజెలెస్ ఒలింపిక్స్‌లో ఈవెంట్లో పాల్గొనకుండా అమెరికా అధినేతపై నిషేధం విధించే అవకాశముందని సమాచారం. అయితే.. వాడా అధికార ప్రతినిధి జేమ్స్ ఫిట్జెరాల్డ్ మాత్రం అదేమీ లేదని అంటుండడం గమనార్హం.చదవండి: IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్! -
ఇరాన్ ఆడకపోవడమే మంచిది.. ట్రంప్ వార్నింగ్!
మరో రెండు నెలల్లో ఫుట్‌బాల్ సాకర్ ఫీవర్ మొదలుకానుంది. అమెరికా,మెక్సికో,కెనడా దేశాలు సంయుక్తంగా 2026 ఫిపా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ ఏడాది జూన్ 11 నుంచి జూలై 19 వరకు సాకర్ మెగాటోర్నీ జరగనుంది. అయితే పశ్చిమాసియాలో ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం ప్రస్తుతం భీకరరూపం దాల్చింది. దీంతో ఇరాన్ జట్టు ఫిఫా వరల్డ్‌కప్ ఆడలేమని ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ జట్టు ఫిపా వరల్డ్‌కప్ ఆడేందుకు స్వాగతిస్తామని ఫిఫా చీఫ్ జియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. తాజాగా జియాని వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్‌సోషల్ వేదికగా స్పందించారు. ‘ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు సాకర్ ప్రపంచకప్‌లో ఆడడం, ఆడకపోవడమనేది వారిష్టం. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ఆటగాళ్లు అమెరికాకు వస్తే మాత్రం వారి ప్రాణాలకు, భద్రతకు మేము ఎంతమాత్రం గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి వీలైనంత వరకు ఇరాన్ వరల్డ్‌కప్‌కు దూరంగా ఉండడమే మంచిది’ అని సున్నితంగా హెచ్చరించారు.2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో (4-2) ఫ్రాన్స్‌ను ఓడించింది. తద్వారా 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది జూన్ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్‌కప్ జూలై 19 వరకు జరగనుంది. మొత్తం 48 జట్లు పాల్గొననుండగా.. నాలుగేసి జట్లు 12గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడనున్నాయి. మొత్తం 104 మ్యాచ్‌లు జరగనుండగా, అందులో 78 మ్యాచ్‌లు అమెరికాలో, కెనడా, మెక్సికోలు చెరో 13మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్.. బెల్జియం, ఈజిప్టు, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.చదవండి: మా అన్న పెళ్లికి ధూంధాం చేస్తా! -
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొనం: ఇరాన్
దుబాయ్: ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాలో జరగబోయే పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు ఉమ్మడిగా ఈ జూన్, జూలైల్లో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే ప్రస్తుతం తమ దేశం మీదపడి దాడులు చేస్తున్న అమెరికా... అక్కడికెళ్లే మా జట్టుకు హాని చేయకుండా ఉండదని ఇరాన్ ఆరోపించింది. "అత్యంత క్రూరంగా అమెరికా ప్రవర్తిస్తోంది. గడిచిన ఎనిమిది తొమ్మిది నెలల్లోనే రెండోసారి మాపై యుద్ధం చేస్తోంది. వేల సంఖ్యలో మా ప్రజల ఉసురు తీస్తోంది. ఇలాంటి దేశానికి వెళ్లి మేం ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడే పరిస్థితి ఉంటుందా? ఆ దేశంలో ఆడే ప్రసక్తే లేదు" అని ఇరాన్ క్రీడల మంత్రి అహ్మద్ దొన్యమలి ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. దీంతో అధికారికంగా అమెరికా ఆతిథ్యమిచ్చే ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను ఇరాన్ బహిష్కరించనుందని తేటతెల్లమైంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ బహిష్కరణ వాఖ్యల్ని బేఖాతరు చేస్తూ తేలిగ్గా కొట్టిపారేశారు.చదవండి: రిచాకు రూ. 61 లక్షలుదీప్తికి రూ. 34 లక్షలు -
WC 2026: యుద్ధం ఎఫెక్ట్.. ప్రపంచకప్ టోర్నీ నుంచి అవుట్
యుద్ధం వేళ ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి ఇరాన్ వైదొలిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో టోర్నీనే బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ ఏడాది జూన్–జూలైలలో అమెరికా, మెక్సికో, కెనడాలలో ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మెగా టోర్నీలో ఇరాన్ జట్టు బరిలోకి దిగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు మెహదీ తాజ్ స్పష్టం చేశాడు.వైమానిక దాడులుకాగా మిత్రదేశం ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనిని మట్టుబెట్టింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేస్తోంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచకప్ కోసం ఎదురుచూసేందుకు ఏమాత్రం వీల్లేదని మెహదీ తాజ్ అన్నాడు.ఫలితంగా యుద్ధవాతావరణం నేపథ్యంలో జూన్–జూలైలలో జరిగే ప్రపంచకప్‌లో ఇరాన్ పాల్గొనడం సందేహస్పదంగా మారింది. గ్రూప్ ‘జి’లో బెల్జియం, న్యూజిలాండ్, ఈజిప్ట్‌లతో కలసి ఉంది ఇరాన్.గత ఆరు పర్యాయాల్లోనూషెడ్యూల్ ప్రకారం జూన్ 15న న్యూజిలాండ్‌తో (కాలిఫోర్నియాలో), జూన్ 21న బెల్జియంతో (కాలిఫోర్నియాలో), జూన్ 26న ఈజిప్ట్‌తో (సియాటెల్‌లో) ఆడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇరాన్ అభిమానుల ప్రవేశంపై ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది జూలైలో నిషేధం విధించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న ఇరాన్ జట్టు ఏడోసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందింది. అయితే ఆ జట్టు గత ఆరు పర్యాయాల్లోనూ (1978, 1998, 2006, 2014, 2018, 2022) గ్రూప్ దశను దాటి ముందుకెళ్లలేకపోయింది.ఇరాన్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?ఒకవేళ ఇరాన్ ప్రపంచకప్ టోర్నీ నుంచి తప్పుకొంటే.. ఆ జట్టు స్థానంలో ఆసియా నుంచే మరో జట్టు టోర్నీలో అడుగుపెడుతుంది. ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య ఇందుకు సంబంధించి ఫిఫాకు వివరాలు ఇవ్వనుంది. కాగా ఆసియా నుంచి టాప్‌లో ఉన్న ఇరాన్.. టోర్నీకి అర్హత సాధించగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్, యూఏఈ ఉన్నాయి. భారీ జరిమానాఅయితే, టోర్నీ ఆరంభానికి ముందే ఇరాన్ తమ తుది నిర్ణయం చెపాల్సి ఉంటుంది. ఒకవేళ టోర్నీ ఆరంభానికి నెల రోజుల ముందు కంటే నిర్ణయం చెప్పనట్లయితే $324,000 (దాదాపు రూ. 3 కోట్లు).. ఒకవేళ 30 రోజులు దాటిన తర్వాత నిర్ణయం చెబితే వైదొలిగిన జట్టు $648,000 మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రపంచకప్ సన్నాహకాల కోసం FIFA ఇచ్చిన నిధులను కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.చదవండి: FIFA World Cup 2026: అర్హత సాధించిన దేశాలు ఇవే


