ఇరాన్‌ అభ్యర్థనతో చిక్కుల్లో ఫిఫా! | FIFA Suffer Same Fate As Cricket Iran Urges Matches To Move Mexico | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: ఇరాన్‌ అభ్యర్థనతో చిక్కుల్లో ఫిఫా!

Mar 17 2026 4:33 PM | Updated on Mar 17 2026 5:48 PM

FIFA Suffer Same Fate As Cricket Iran Urges Matches To Move Mexico

పశ్చిమాసియాలో భీకరయుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ జట్టు జూన్‌లో జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనాలా వద్దా అనే సంశయంలో ఉంది. జూన్‌ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న 2026 ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే వరల్డ్‌కప్‌ ఆడేందుకు ఇరాన్‌ మా దేశంలో అడుగుపెడితే ఆ దేశ ఆటగాళ్లకు తాము భద్రత కల్పించలేమని, కాబట్టి ఇరాన్‌ ప్రపంచకప్‌ నుంచి వైదొలగడమే మంచిదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు చేశారు. 

అయితే ట్రంప్‌ కంటే ముందే అమెరికాలో వరల్డ్‌కప్‌ ఆడబోయేది లేదని ఇరాన్‌ ముందే భీష్ముంచుకుంది. తాజాగా ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ముందస్తుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం అమెరికాలో తాము ఆడాల్సిన మ్యాచ్‌లను మెక్సికోకు తరలించాలని ఇరాన్‌ ఫిఫా సమాఖ్యకు అర్జీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

యుద్ధం సమయంలో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని, ఏక్షణం ఏమైనా జరిగే అవకాశముంటుందని, అందుకే మా మ్యాచ్‌లను అమెరికా నుంచి మెక్సికో లేదా కెనడాకు మార్చాలని ఇరాన్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య ఫిఫా సమాఖ్యను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్‌ ప్రతిపాదనపై ఫిఫా సమాఖ్య ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

ఇరాన్‌ ప్రతిపాదనకు అంగీకరిస్తూ మ్యాచ్‌ వేదికలను మార్చాలా లేక ఇరాన్‌ స్థానంలో వేరే జట్టుకు అవకాశమివ్వాలా అన్నది ఆలోచిస్తుంది. ఇదంతా గమనించిన క్రీడాభిమానులు ఇరాన్‌ ప్రతిపాదనను క్రికెట్‌ టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా ఐసీసీకి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు చేసిన అభ్యర్థనతో పోలుస్తున్నారు. 2026 టీ20 ప్రపంచకప్‌కు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. 

అయితే టోర్నీ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్‌కు భారత్‌తో సంబంధాలు సఖ్యతగా లేవు. అప్పటికే బంగ్లాదేశ్‌ అ‍ల్లర్లతో అట్టుడికిపోయింది. దీంతో భారత్‌లో తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు పొంచి ఉందని  ఈ కారణంగా భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ ఆడలేమని, తమ మ్యాచ్‌ వేదికలను లంకకు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌కు ప్రతిపాదనలు చేసింది. 

కానీ ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లకుండా తాము చూసుకుంటామని తెలిపిన ఐసీసీ వేదికలను మార్చే ప్రసక్తే లేదని బంగ్లా క్రికెట్‌ బోర్డుకు తేల్చి చెప్పింది. దీంతో బంగ్లాదేశ్‌ జట్టు మూర్కత్వానికి పోయి టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించింది. తాజాగా అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్‌ పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. అమెరికాలో ఆడబోమని ఇప్పటికే స్పష్టం చేసిన ఇరాన్‌ .. ఫిఫా సమాఖ్య వారి ప్రతిపాదనకు అంగీకరిస్తే తప్ప ఈసారి సాకర్‌ ప్రపంచకప్‌లో వారి ఆటను చూడలేమనుకుంటా!

చదవండి: ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement