లండన్: ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీతో విదేశాల్లో తొలి సెంచరీ సాధించడంతో పాటు పలు రికార్డులు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ సెంచరీతో మురిసిపోయిన భార్య రితికా శర్మ భర్తపై ముద్దుల వర్షం (ప్లైయింగ్ కిస్) కురిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు కెమెరాలు క్లిక్‌మనిపించాయి. కాగా రోహిత్ సిక్స్ కొట్టి సెంచరీ చేసిన వెంటనే తన భార్య కూర్చొని ఉన్న గ్యాలరీవైపు బ్యాట్‌ను ఎత్తి చూపాడు. వెంటనే రితికా లేచి నిలబడి సంతోషంతో ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది.
చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ సెంచరీ.. విదేశీ గడ్డపై తొలిసారి
ఆ తర్వాత రోహిత్ తన బ్యాట్‌ను డ్రెస్సింగ్‌రూమ్ వైపు తిప్పగా.. రవిశాస్త్రి , ఇతర ఆటగాళ్లు చప్పట్లతో అభినందించగా.. కోహ్లి మరికాస్త ముందుకెళ్లి తన చేతితో కుమ్మేయ్ అన్న రీతిలో సైగ చేశాడు. ఇక మూడోరోజు అన్ని సెషన్లలో పూర్తి ఆధిపత్యం చెలాయించిన టీమిండియా నాలుగో రోజు ఆటను ఆరంభించింది. ప్రస్తుతం 96 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. కోహ్లి 27, జడేజా 12 పరుగులతో ఆడుతున్నారు. ఓవరాల్‌గా టీమిండియా 179 పరుగుల ఆధిక్యంలో ఉంది.
చదవండి: ENG Vs IND: 'పుజారాతో పెట్టుకోకు ఓవర్టన్'.. వీడియో వైరల్
Talented batter: Scores a century 👏
— Mumbai Indians (@mipaltan) September 4, 2021
Brilliant batter: Scores an away Test century 🙌
Hitman: Scores an away Test century with a SIX 💙💙💙#OneFamily #MumbaiIndians #ENGvIND @ImRo45 pic.twitter.com/4wvKWvnQC1
Flying kiss from wife😍 pic.twitter.com/lcwrgwRFn7
— Shubham Rai (@Shubhamrai_) September 4, 2021
Comments
Please login to add a commentAdd a comment