చెన్నై: టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కాకుండానే మాటల యుద్ధం మొదలైంది. జోఫ్రా ఆర్చర్ తన అస్త్ర శస్త్రాలతో టీమిండియా భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నాడని.. భారత ఆటగాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ కెప్టెన్ జో రూట్ హెచ్చరించాడు. ఈ సందర్భంగా ప్రాక్టీస్ సమయంలో జోఫ్రా ఆర్చర్ వేసే బంతులు మంచి రిథమ్‌తో బులెట్ కంటే వేగంగా వస్తున్నాయని తెలిపాడు. జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్‌మెన్లకు ఇబ్బంది పడడం ఖాయమని పేర్కొన్నాడు. చదవండి: టీమిండియాతో చేరాను: హార్దిక్ పాండ్యా
కాగా ఆర్చర్‌కు టీమిండియా పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. ఐపీఎల్ 13వ సీజన్ తర్వాత లంకతో జరిగిన సిరీస్‌కు ఆర్చర్ దూరంగా ఉన్నాడు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన ఆర్చర్ 14 మ్యాచ్‌ల్లో 20 వికెట్లతో మంచి ప్రదర్శన కనబరిచాడు. కాగా సీనియర్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లతో పాటు ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్, ఓలీ స్టోన్స్‌లతో పటిష్టంగా ఉన్న జట్టులోకి ఆర్చర్ రాకతో మరింత బలోపేతంగా తయారైంది. కాగా రేపు జరగబోయే తొలి టెస్టుకు ఎవరికి అవకాశం వస్తుందనేది చూడాల్సి ఉంది. చదవండి: ఐపీఎల్: ఆసీస్ ఆటగాళ్లకు సీఏ కీలక సూచన
ఇక బెన్‌స్టోక్స్ విషయంపై రూట్ స్పందిస్తూ.. స్టోక్స్ గురించి మీకందరికి తెలిసిందే. అతను ఫాంలో ఉంటే.. బంతి అతని చేతికి దొరకడమే ఆలస్యం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు. లంకతో సిరీస్‌కు దూరమైనా.. అతను మానసికంగా టీమిండియాతో ఆడడానికి సంసిద్ధం అయ్యాడు. ఇక బ్యాటింగ్ విషయంలో నేను చాలా సెల్ఫిష్‌గా ఉంటా.. ముందు కెప్టెన్‌గా నేను రాణిస్తేనే.. జట్టు రాణిస్తుందన్నది నా నమ్మకం. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రేపటి నుంచి జరగబోయే తొలి టెస్టు రూట్‌కు 100వ మ్యాచ్ కావడం విశేషం. లంకతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రూట్ ఒక డబుల్ సెంచరీ, సెంచరీ సహా మొత్తం 426 పరుగులతో సూపర్ ఫామ్‌ను ప్రదర్శించడంతో ఈ సిరీస్‌లో అందరి కళ్లు రూట్‌పైనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment