అహ్మదాబాద్: సరిహద్దులో తీవ్రవాదుల చేతుల్లో భారత సైనికులు చనిపోయి నెలరోజులు కూడా కాలేదు... కానీ పాకిస్తాన్ ఆటగాళ్లకు ‘గర్బా’ నృత్యాలతో పూలు చల్లుతూ స్వాగతం చెబుతారా? వరల్డ్ కప్ టోర్మికి ప్రారంభోత్సవం జరపలేదు కానీ ఈ మ్యాచ్‌కు ముందు ఉత్సవం నిర్వహించి పాక్ టీమ్‌కు ఎక్కడలేని ప్రాధాన్యతనిస్తారా? ఆర్మికి మాత్రమే బాధ్యత ఉంటుంది తప్ప వేరేవారికి దేశం గురించి బాధ్యత లేదా? బీసీసీఐకి ఆదాయం మినహా త్యాగాలు, ప్రజల భావోద్వేగాలంటే లెక్క లేదు? ఇలా నేటి మ్యాచ్ గురించి దేశవాప్తంగా ఎంత ఆసక్తి ఉందో అంతే స్థాయిలో తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి.
అయితే వీటన్నింటిని బీసీసీఐ పట్టించుకునే పరిస్థితిలో లేదు! ముందే ప్రకటించినట్లుగా భారత్, పాక్ మ్యాచ్ ఆటకు ముందు రంగురంగుల వేడుకను జరపనుంది. టాస్‌కు ముందు ప్రముఖ గాయకులు అరిజిత్ సింగ్, శంకర్ మహదేవన్, సుఖ్వీందర్ సింగ్, సునిధి చౌహాన్‌ల సంగీత ప్రదర్శన ఉంటుంది. ఇది 45 నిమిషాల పాటు సాగుతుంది. ఇన్నింగ్స్ విరామం మధ్యలో కూడా నేహ కక్కడ్, దర్శన్ రావల్ తమ గాత్రంతో అలరిస్తారు. ఈ మ్యాచ్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులతో పాటు అమితాబ్ బచ్చన్, రజినీకాంత్‌వంటి స్టార్లు హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment