entertainment program
-
మ్యూజిక్... మస్తీ!
అహ్మదాబాద్: సరిహద్దులో తీవ్రవాదుల చేతుల్లో భారత సైనికులు చనిపోయి నెలరోజులు కూడా కాలేదు... కానీ పాకిస్తాన్ ఆటగాళ్లకు ‘గర్బా’ నృత్యాలతో పూలు చల్లుతూ స్వాగతం చెబుతారా? వరల్డ్ కప్ టోర్మికి ప్రారంభోత్సవం జరపలేదు కానీ ఈ మ్యాచ్‌కు ముందు ఉత్సవం నిర్వహించి పాక్ టీమ్‌కు ఎక్కడలేని ప్రాధాన్యతనిస్తారా? ఆర్మికి మాత్రమే బాధ్యత ఉంటుంది తప్ప వేరేవారికి దేశం గురించి బాధ్యత లేదా? బీసీసీఐకి ఆదాయం మినహా త్యాగాలు, ప్రజల భావోద్వేగాలంటే లెక్క లేదు? ఇలా నేటి మ్యాచ్ గురించి దేశవాప్తంగా ఎంత ఆసక్తి ఉందో అంతే స్థాయిలో తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే వీటన్నింటిని బీసీసీఐ పట్టించుకునే పరిస్థితిలో లేదు! ముందే ప్రకటించినట్లుగా భారత్, పాక్ మ్యాచ్ ఆటకు ముందు రంగురంగుల వేడుకను జరపనుంది. టాస్కు ముందు ప్రముఖ గాయకులు అరిజిత్ సింగ్, శంకర్ మహదేవన్, సుఖ్వీందర్ సింగ్, సునిధి చౌహాన్‌ల సంగీత ప్రదర్శన ఉంటుంది. ఇది 45 నిమిషాల పాటు సాగుతుంది. ఇన్నింగ్స్ విరామం మధ్యలో కూడా నేహ కక్కడ్, దర్శన్ రావల్ తమ గాత్రంతో అలరిస్తారు. ఈ మ్యాచ్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులతో పాటు అమితాబ్ బచ్చన్, రజినీకాంత్వంటి స్టార్లు హాజరు కానున్నారు. -
ఉంగరం దొంగలు మీరేనా?
సింహాద్రి నాథుడి ఉంగరం పోయింది. దానికోసం అన్వేషించే క్రమంలో భక్తులను బంధించి విచారించే కార్యక్రమం జరిగింది. అలా అర్చకులకు చిక్కిన విద్యార్థినులు ఉంగరం చోరీలో తమ ప్రమేయం లేదని మొరపెట్టుకున్నారు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని ఆనందభరితులయ్యారు. తమకు మాత్రమే లభించిన ఈ అరుదైన అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సింహాచలం : నిన్న రాత్రి స్వామివారి ఉంగరం పోయింది. మీరే దొంగిలించారని తెలిసింది. దయచేసి దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం... అని స్థానాచార్యులు అడిగేసరికి భక్తులు ఆశ్చర్యపోయారు. స్వామి దర్శనానికి వస్తే ఉంగరం దొంగతనం చేశారంటారేంటి? తాళ్లతో బంధించి తీసుకురావడమేంటి? మేము దొంగల్లా కనిపిస్తున్నామా అంటూ స్థానాచార్యులను భక్తులు ఆవేశంతో ఎదురు ప్రశ్నించారు. చూడండీ.. మీరు దొంగతనం చేసినట్టు మా దగ్గర ఆధారాలున్నాయి. సీసీ కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి. పోలీసులు తీసుకెళ్లకముందే ఉంగరాన్ని ఇచ్చేయండంటూ స్థానాచార్యులు ప్రశ్నించే సరికి భక్తుల కళ్లంట నీళ్లు తిరిగాయి. దొంగతనం చేయలేదని చెబుతున్నా వినకుండా, అందరిమధ్యలో మీరే ఉంగరం దొంగతనం చేశారని స్థానాచార్యులు పదేపదే ప్రశ్నించడంతో కన్నీటిపర్యవంతయ్యారు. తమవైపు చూసి నవ్వుతున్న వాళ్లపై ఆవేశంతో చిందులు కూడా వేశారు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టాలని తెలుసుకుని ఆనందభరితులయ్యారు. తమకు మాత్రమే లభించిన ఈ అరుదైన అవకాశంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇదీ... సింహగిరిపై ఆదివారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వినోదోత్సవం. ఈనెల 11 నుంచి వారం రోజుల పాటు జరిగిన స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో దొంగిలించబడ్డ స్వామి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని సింహగిరిపై ఆదివారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఏడు పరదాల్లో దాగున్న స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో కూర్చోబెట్టారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి సీతారామాచార్యులు కర్రను చేతితో పట్టుకుని దర్శనానికి వచ్చిన భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి తీసుకొచ్చారు. స్థానాచార్యులు టీపీ రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాని తొలగించారు. చివరికి ఆయన చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. నగరంలోని మాధవదార ప్రాంతానికి చెందిన శ్రావ్య, జాహ్నవి, శృతి అనే విద్యార్థులు తాము దొంగలం కాదంటూ వ్యక్తం చేసిన ఆందోళన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే స్వామివారి దర్శనానికి గాజువాకకు చెందిన ఎయిర్‌టెల్‌లో పనిచేస్తున్న కల్యాణి, మంజు, మణి, త్రినాథ్, విశాఖకు చెందిన న్యాయవాది పద్మజ, నగరంలోని ఐటీఐ ప్రాంతానికి చెందిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉద్యోగి రమేష్ దంపతులు, తెలంగాణ రాష్ట్రం వేములవాడకు చెందిన సాయికిరణ్ దంపతులు, అనకాపల్లికి చెందిన వంశీధర్, పార్థసారథి సైతం దొంగలుగా చిక్కారు. అలాగే దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ, ఆలయ కొత్వాల్ నాయక్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్‌రాజ్, బయ్యవరపు రాధ, ఏఈవో తిరుమలేశ్వరరావు, ఇన్చార్జి ప్రధానార్చకుడు కేకే ప్రసాదాచార్యులు, ఉప ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఆలయ సూపరింటిండెంట్ నిద్దాం నాయుడు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కనకరాజు సైతం దొంగలుగా బందీలయ్యారు. చివరికి దొంగలంటూ భక్తులను ప్రశ్నించిన స్థానాచార్యులను, కర్రపట్టుకుని తాళ్లతో భక్తులను బంధించిన పురోహిత్ అలంకారి సైతం కూడా దొంగలుగా చిత్రీకరింపబడ్డారు. మంత్రి గారూ ఉంగరం ఇచ్చేయండి రాష్ట్రానికి మంత్రిగా ఉండి మీరు కూడా ఉంగరం దొంగతం చేస్తే ఎలాగండీ.. దయచేసి ఉంగరం ఇచ్చేయండంటూ రాష్ట్ర బీసీ వెల్ఫేర్, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను స్థానాచార్యులు కోకారు. సింహగిరిపై వినోదోత్సవం జరుగుతున్నప్పుడే ఆలయానికి మంత్రి చెల్లుబోయిన దర్శనానికి వచ్చారు. ఆయన రాజగోపురం వద్దకు రాగానే పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి స్థానాచార్యుల ముందు హాజరుపరిచారు. దొంగలించిన ఉంగరం ఇచ్చేయాలంటూ స్థానాచార్యులు మంత్రిని అడిగారు. ఏ ఆపదా రాకూడదని ఆస్వామి రక్ష (తాడు) వేశాడని, స్వామి అనుగ్రహం నాపై ఉందని భావిస్తున్నట్టు మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. వినోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉత్సవం అనంతరం మంత్రి స్వామివారి పల్లకీని మోశారు. -
విజయవాడలో హ్యాపీ సండే!
-
ఇంటర్నెట్ లో మాయగాళ్లు
సాక్షి,హైదరాబాద్: ‘కంగ్రాట్స్ మా సంస్థ మిమ్మల్ని అవార్డు గ్రహీతగా ఎంపిక చేసింది. విదేశాల్లో జరిగే పసందైన వినోద కార్యక్రమంలో పాల్గొనేందుకు సంస్థ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తాం’ ఇటీవల నగరంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మెయిల్‌కు వచ్చిన సందేశం ఇది. ‘లండన్‌లోని ఓ ధనవంతురాలికి సంతానం లేదు. ఆమె మిమ్మల్ని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఇక ఆమె ఆస్తికి మీరే వారసులు’ ఇది ఓ ప్రైవేట్ ఉద్యోగికి వచ్చిన సందేశ సారాంశం. ‘మీకు ఐదు కోట్ల రూపాయల విలువైన అంతర్జాతీయ లాటరీ తగిలింది. ఆ మొత్తం పొందడానికి సంస్థ నిబంధనల మేరకు రూ.60 వేలు ముందుగా చెల్లిస్తే చాలు’ అన్న సందేశం మరో యువకుడి మెయిల్లో ప్రత్యక్షమైంది. ఇలాంటి సందేశాలను చూసి ముందూ వెనుకా ఆలోచించకుండా కొందరు అందిన చోటల్లా అప్పులు చేసి ఈ-మెయిల్లో పేర్కొన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేశారు. వారం రోజులు ఎదురు చూసినా ఎటువంటి సమాచారం అందకపోవడంతో వివరణ కోరుతూ మెయిల్ వచ్చిన చిరునామాకు లేఖ పంపా రు. అయినా సమాధానం లేదు. అప్పుడు తాను మోసపోయానని గ్రహించి ఘొల్లుమన్నారు. ఇలాంటి హై టెక్ మోసాలు చేసేందుకు కొన్ని వ్యవస్థీకృత ముఠాలు ఏర్పడ్డాయి. ‘ఈ-మాయగాళ్లు’ వ్యవహారం తెలియక అనేక మంది అమాయక ప్రజలు తాము సంపాదించిన సొమ్మును చేజేతులా పోగొట్టుకుంటున్నారు. సెల్‌ఫోన్లలోనూ.. నిత్య జీవనంలో తప్పనిసరి వస్తువుగా మారిన సెల్ఫోన్లు కూడా ఈ కేటుగాళ్లకు వరంలా మారిపోయాయి. పలు ఆకర్షణీయ బహుమతులున్నాయని నచ్చిన వారితో స్నేహం చేసే వీలుంటుందని ఆకర్షిస్తూ భారీగానే సొమ్ము చేసుకుంటున్నారు. నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రజల సొమ్మును కాజేసేందుకు నకిలీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. నగరంలో గతంలో జరిగిన ఇలాంటి మోసాలకు మూలం నైజీరియన్, ఉత్తరాదికి చెందిన ముఠాలని సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో వెల్లడవుతోంది. పోలీసులు ఇలాంటి మోసగాళ్లకు చెక్ పెడుతున్నా అక్కడక్కడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచన. -
నేటి నుంచి ఉపమాకలో బ్రహ్మోత్సవాలు
నక్కపల్లిన్యూస్లైన్: ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఉపమాకలో వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శని వారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రతిఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఉపమాకలో నేత్రపర్వంగా జరుగుతాయి. తిరుపతిలో మాదిరిగా ఇక్కడ కూడా ఏటా కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవా లు, ధనుర్మాసోత్సవాలను దేవాదాయశాఖ ఘనంగా నిర్వహిస్తుంది. బ్రహ్మోత్సవాల్లో బాగంగా శని వారం రాత్రి అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆదివారం (6వతేదీ) మధ్యాహ్నం ధ్వజారోహణ, రాత్రి తిరువీధి సేవ నిర్వహిస్తారు. ఆలయంలో ధ్వజ స్తంభం వద్ద ధ్వజ పటాన్నిఎగురవేసి అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించే కార్యక్రమంజరుగుతుంది. ఏడు నుంచి 14 వరకు ఉదయం, రాత్రి స్వామివారికి తిరువీది సేవలు నిర్వహిస్తారు. తిరువీధి సేవల్లో బాగంగా శ్రీదేవి,భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామిని వివిధ వాహనాల్లో ఉంచి ఉపమాక మాడ వీధుల్లో ఊరేగిస్తారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11న ఇత్తడి గరుడవాహనంపై స్వామికి తిరువీధి సేవ జరుగుతుంది. 12 రాత్రి రథోత్సవం సందర్భంగా స్వామిని, అమ్మవార్లను పుణ్యకోటి వాహనంపై తిరువీధుల్లో ఊరేగిస్తారు.13న సాయంత్రం మృగయా వినోదం కార్యక్రమం అనంతరం గజవాహనంపై తిరువీధి సేవ చేస్తారు. ఈరోజే విజయదశమి కావడంతో శమీపూజ నిర్వహించిన అనంతరం పుణ్యకోటి వాహనంపై తిరువీధి నిర్వర్తిస్తామని ప్రధానార్చకుడు వరప్రసాద్ చెప్పారు. 14న మధ్యాహ్నం పూర్ణాహుతి, వినోదోత్సవం, ఆపై స్వామివారి చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు సంబందించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో శేఖర్‌బాబు తెలిపారు.