ఫిఫా ప్రపంచకప్‌లో నార్వే జట్టు రౌండ్ ఆఫ్ 32 దశకు అర్హత సాధించింది. గ్రూప్-ఐలో భాగంగా మంగళవారం సెనెగల్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో నార్వే 3-2తో విజయాన్ని అందుకుంది. నార్వే తరఫున స్టార్ ఆటగాడు ఎర్లింగ్ హాలండ్ (ఆట 48, 58వ నిమిషం) డబుల్ గోల్స్ కొట్టగా, మార్కస్ పెడెర్సన్ (ఆట 43వ నిమిషం) మరో గోల్ చేశాడు. అటు సెనెగల్ తరఫున ఇస్మాయిల్ సర్ (ఆట 53, 90+3వ నిమిషం) రెండు గోల్స్ కొట్టాడు. ఈ విజయంతో నార్వే నాకౌట్ దశకు చేరుకోగా సెనెగల్ ఆడిన రెండింటిలో ఓడి ఇంటిబాట పట్టింది.

ఇక రెండు గోల్స్ సాధించిన ఎర్లింగ్ హాలండ్‌కు 52 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 59 గోల్స్ కావడం విశేషం. అంతేకాదు ఫిఫా ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడం నార్వేకు ఇదే తొలిసారి. కాగా లీగ్ దశలో నార్వే తన చివరి మ్యాచ్‌ను ఫ్రాన్స్‌తో ఆడనుంది.

నార్వే ‘వై కింగ్’ సెలబ్రేషన్
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, ముఖ్యంగా ప్రపంచకప్ (World Cup) లాంటి మెగా టోర్నమెంట్లలో నార్వే దేశ ఫుట్‌బాల్ జట్టు, వారి అభిమానులు "వైకింగ్ రోయింగ్" (Viking rowing) అనే వినూత్నమైన సెలబ్రేషన్ చేసుకుంటారు. ఆటగాళ్లు లేదా అభిమానులు నేలపై వరుసగా కూర్చొని, తెడ్డు వేస్తున్నట్లు (rowing) హావభావాలు ప్రదర్శిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఇది వారి దేశ సంస్కృతికి ప్రతీక.

The Norwegian team and fans doing the Row are just beautiful.pic.twitter.com/hi2YqZimUi
— World Cup 2026 Daily (@TotalFootball) June 23, 2026
Read: వందో మ్యాచ్‌లో ఎంబాపె రికార్డు గోల్స్.. నాకౌట్‌కు ఫ్రాన్స్


