ఆస్ట్రేలియా యువ సంచలనం నాథన్ మెక్‌స్వీనీ తన జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. టీమిండియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన ఆసీస్ జట్టులో నాథన్ మెక్‌స్వీనీకి చోటు దక్కింది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా భారత్‌తో జరగనున్న తొలి టెస్టుతో మెక్‌స్వీనీ డెబ్యూ చేయడం దాదాపు ఖాయమైనట్లే.
మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వారుసుడిగా ఆసీస్ ఇన్నింగ్స్‌ను మెక్‌స్వీనీ ప్రారంభించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ క్రమంలో తొలి టెస్టుకు సన్నద్దమవుతున్న మెక్‌స్వీనీ.. భారత్ పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాను ఎదుర్కొవడం చాలా కష్టమని ఈ ఆసీస్ యువ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.
బుమ్రాతో అంత ఈజీ కాదు: మెక్‌స్వీనీ
"ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఆసీస్‌ను ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. పెర్త్‌లో నా బెస్ట్ ఇచ్చేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాను. ఇక బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొవడం చాలా కష్టం. అతడి బౌలింగ్ యాక్షన్ చాలా భిన్నంగా ఉంటుంది. అతడు వరల్డ్‌లోనే బెస్ట్ బౌలర్.
నేను ఇప్పటివరకు అటువంటి బౌలింగ్ యాక్షన్‌ను ఎదుర్కోలేదు. అందుకే బుమ్రాను క్యాచ్అప్ చేయడానికి అతడి పాత బౌలింగ్ వీడియోలు చూస్తున్నాను. ఇప్పటికే అతడు బౌలింగ్ ఎటాక్ ఎలా ఉంటుందో, కొత్త బంతితో ఎలా బౌలింగ్ చేస్తున్నాడో కొన్ని వీడియో క్లిప్‌లను చూశాను. ఏదేమైనప్పటకి బుమ్రా లాంటి కొత్త బౌలర్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు" అని ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెక్‌స్వీనీ పేర్కొన్నాడు.
చదవండి: ICC CT 2025: టీమిండియా లేకుంటే చాంపియన్స్ ట్రోఫీ లేనట్లే!
Comments
Please login to add a commentAdd a comment