
టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. స్వదేశంలో వందో వన్డే ఆడుతున్న కోహ్లి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. మరోసారి తన ఆఫ్‌స్టంప్ బలహీనతను బయటపెట్టిన కోహ్లి కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఓడెన్ స్మిత్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 12వ ఓవర్లో మూడో బంతిని బౌండరీకి తరలించి ఊపు మీద కనిపించిన కోహ్లి.. కాసేపటికే ఆ ఓవర్ ఆఖరి బంతికి ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని ముద్దాడి మూల్యం చెల్లించుకున్నాడు.
తనకు ప్రతిష్టాత్మకమైన వందో వన్డేలో చెత్త ప్రదర్శన చేయడం కోహ్లి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మరోవైపు రీఎంట్రీలో విండీస్ బౌలర్ ఓడెన్ స్మిత్ అదరగొట్టాడు. రిషబ్ పంత్‌తో పాటు కోహ్లిని ఒకే ఓవర్లో వెనక్కిపంపి టీమిండియాను దెబ్బ తీయడంలో సక్సెస్ అయ్యా డు.
Comments
Please login to add a commentAdd a comment