Fans troll Rohit Sharma, miss Virat Kohli after horror show on WTC Final Day 1 - Sakshi
Sakshi News home page

WTC Final: ఐపీఎల్‌లో దుమ్మురేపారు.. ఇక్కడ మాత్రం చేతులెత్తేశారు! అట్లుంటది మనవాళ్ల తోటి

Published Fri, Jun 9 2023 10:41 AM | Last Updated on Fri, Jun 9 2023 11:14 AM

Fans troll Rohit Sharma, miss Virat Kohli after horror show on WTC Final - Sakshi

లండన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరగుతున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమిండియా టాపర్డర్‌ ఆటగాళ్లు తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు.. 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఇక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో 15 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. కమ్మిన్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 

ఆ తర్వాత అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌(13) కూడా రోహిత్‌ బాటలోనే నడిచాడు. రోహిత్‌ ఔటైన వెంటనే గిల్‌ కూడా పెవిలియన్‌కు చేరాడు. ఈ సమయంలో సీనియర్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, పుజారా భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతారని అంతా భావించారు. కానీ వరుస క్రమంలో వీరిద్దరికూడా తమ వికెట్లను సమర్పించకున్నారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన జడేజా(51 బంతుల్లో 48) ఆసీస్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోర్‌ బోర్డును కాస్త ముందుకు కదిలించాడు.

 

అయితే జడేజా కూడా రెండో రోజు ఆటముగిసే ఆఖరిలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులోఅజింక్య రహానే(29), కేఎస్‌ భరత్‌(5) పరుగులతో ఉన్నారు. ఈ గడ్డుపరిస్థితుల నుంచి జట్టు గట్టక్కించే భారం మొత్తం రహానే పైనే ఉంది. ఇక ఇది ఇలా ఉండగా.. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన భారత ఆటగాళ్లపై అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఐపీఎల్‌లో దుమ్మురేపారు.. కీలక మ్యాచ్‌లో మాత్రం చేతులేత్తాశారు అంటూ నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. కాగా శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో తమ ఫామ్‌ను కొనసాగించలేకపోయారు. కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: WTC Final: ఆసీస్‌ బౌలర్‌ సూపర్‌ డెలివరీ.. దెబ్బకు గిల్‌కు ప్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement