Jasprit Bumrah Gets Brutally Trolled For Posting A Picture With Wife Sanjana Ganesan After WTC Final Loss - Sakshi
Sakshi News home page

పెళ్లైనప్పటి నుంచి నీలో జోష్‌ తగ్గింది; బుమ్రాపై ట్రోల్స్‌

Published Thu, Jul 1 2021 3:15 PM | Last Updated on Thu, Jul 1 2021 3:59 PM

Fans Trolls On Jasprit Bumrah New Photo With His Wife Sanjana Ganesan - Sakshi

ముంబై: ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా దారుణ ప్రదర్శనపై విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. లోస్కోరింగ్‌లే నమోదైన ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పెద్దగా రాణించింది కూడా లేదు. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి చెరో ఏడు వికెట్లు తీయగా.. బుమ్రా మాత్రం ఎలాంటి వికెట్ తీయలేదు.  దీంతో టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రాపై ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కనీసం ఒక్క వికెట్ కూడా తీయకపోవడంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బుమ్రా తాజాగా తన భార్య సంజనా గణేశన్‌తో కలిసి దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

అసలే కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఘోరంగా విఫలమయ్యాడని కోపంతో ఉన్న అభిమానులకు తాజా ఫోటో బుమ్రాపై మరింత కోపం వచ్చేలా చేసింది. దీంతో అభిమానులు ట్రోల్స్‌, మీమ్స్‌తో రెచ్చిపోయారు. '' పెళ్లైన నాటి నుంచి ఫోటోల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నావు.. నీలో మునపటి జోష్‌ లేదు.. బుమ్రా ఫోటోలు కాదు ముందు వికెట్లు తీయ్‌.. బుమ్రా భయ్యా వికెట్‌ ఎప్పుడు తీస్తావు.. ముంబై ఇండియన్స్‌ తరపున రెచ్చిపోయి బౌలింగ్‌ చేస్తావు.. మరి టీమిండియాకు వచ్చేసరికి ఎందుకిలా చేస్తున్నావు.'' అంటూ కామెంట్లు చేశారు. ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగియడంతో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు సిద్ధమవుతుంది. ఆగస్టు 4 నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. మరి ఈ టెస్టు సిరీస్‌తోనైనా టీమిండియా ఫామ్‌లోకి వస్తుందేమో చూడాలి. 

చదవండి: ICC Rankings: మళ్లీ టాప్‌లో కేన్‌ విలియమ్సన్‌; కెరీర్‌ బెస్ట్‌కు కైల్‌ జేమిసన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement