ఎనిమిది జట్ల సయ్యాట.. ఫిఫా క్వార్టర్‌ ఫైనల్స్‌ షెడ్యూల్‌ ఇదే | FIFA World Cup 2026 Quarter-Finals-Qualified Teams-Schedule-Details | Sakshi
Sakshi News home page

ఎనిమిది జట్ల సయ్యాట.. ఫిఫా క్వార్టర్‌ ఫైనల్స్‌ షెడ్యూల్‌ ఇదే

Jul 8 2026 4:40 PM | Updated on Jul 8 2026 5:11 PM

FIFA World Cup 2026 Quarter-Finals-Qualified Teams-Schedule-Details

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 క్వార్టర్ ఫైన‌ల్ ద‌శ‌కు చేరింది. ఇక్క‌డి నుంచి మ్యాచ్‌లు మ‌రింత ర‌స‌వ‌త్తరంగా మార‌నున్నాయి. లీగ్ ద‌శలో 48 జ‌ట్లు పోటీప‌డితే అందులో నుంచి 32 జ‌ట్లు రౌండ్ ఆఫ్ 32కు చేరాయి. అక్క‌డి నుంచి 16 జ‌ట్లు ప్రిక్వార్ట‌ర్స్‌కు చేరుకున్నాయి. ఇప్పుడు క్వార్ట‌ర్ ఫైన‌ల్లో 8 జ‌ట్లు (అర్జెంటీనా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, నార్వే, బెల్జియం, ఇంగ్లండ్‌, మొరాకో, స్విట్జర్లాండ్‌) అమీతుమీకి సిద్ధ‌మ‌ వుతున్నాయి. 


ఎంబాపె (ఫ్రాన్స్‌), మెస్సీ (అర్జెంటీనా)

ఈ ఫిఫాలో భారీ అంచ‌నాలు పెట్టుకున్న పెద్ద జట్ల‌లో చాలా వ‌ర‌కు నిష్క్ర‌మించ‌డం గ‌మ‌నార్హం. జ‌ర్మ‌నీ, పోర్చుగ‌ల్‌, నెద‌ర్లాండ్స్‌, క్రొయేషియా లాంటి జ‌ట్లు ప్రిక్వార్ట‌ర్స్‌లోనే త‌మ ఆట‌ను ముగించాయి. డిఫెండింగ్ చాంపియ‌న్ హోదాలో బ‌రిలోకి దిగిన అర్జెంటీనా త‌మ స్థాయికి త‌గ్గ‌ట్లే వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. 

ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు లియోన‌ల్ మెస్సీ 5 మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌, ఒక అసిస్ట్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. 2022 ఫిఫా ర‌న్న‌ర‌ప్ ఫ్రాన్స్ కూడా త‌మ స్థాయికి త‌గ్గ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తోంది. ముఖ్యంగా ఆ జ‌ట్టు యువ సంచ‌ల‌నం కైలియ‌న్ ఎంబాపె 5 మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్‌తో మెస్సీని అనుస‌రిస్తున్నాడు. 


ఎర్లింగ్‌ హాలండ్‌ (నార్వే), లామినే యమాల్‌ (స్పెయిన్‌)

అన్నీ కుదిరితే 2022 ఫిఫాలో ఫైన‌ల్లో త‌ల‌ప‌డిన అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు ఈసారి సెమీస్ లేదా మ‌రోసారి ఫైన‌ల్లో త‌ల‌ప‌డే అవ‌కాశ‌ముంది. మ‌రోవైపు మాజీ చాంపియ‌న్లు స్పెయిన్‌, ఇంగ్లండ్‌తో పాటు బెల్జియం త‌మ స్థాయి ఆట‌తీరుతో క్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టాయి. ఇక ఎవ‌రూ ఊహించని రీతిలో మొరాకో నార్వే, స్విట్జ‌ర్లాండ్‌ కూడా ప్రిక్వార్ట‌ర్స్‌లో అద‌ర‌గొట్టి క్వార్ట‌ర్స్‌లో ప్రవేశించాయి. ఈ నేప‌థ్యంలో క్వార్ట‌ర్ ఫైనల్ ద‌శ‌లో ఏ జ‌ట్టు ఎవ‌రితో త‌ల‌ప‌డ‌నుంది, ఏ స‌మ‌యానికి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి అనేది ఒక‌సారి ప‌రిశీలిద్దాం.


లుకాకు (బెల్జియం), హ్యారీకేన్‌ (ఇంగ్లండ్‌)

క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్ షెడ్యూల్‌:
👉ఫ్రాన్స్ వ‌ర్సెస్ మొరాకో, జూలై 10, తెల్ల‌వారుజామున 1.30 గంట‌ల‌కు, వేదిక‌: బోస్ట‌న్‌

👉స్పెయిన్ వ‌ర్సెస్ బెల్జియం, జూలై 11, అర్ధరాత్రి 12.30 గంట‌ల‌కు, వేదిక‌: లాస్ ఏంజెలెస్‌

👉నార్వే వ‌ర్సెస్ ఇంగ్లండ్‌, జూలై 12, తెల్ల‌వారుజామున 2.30 గంట‌ల‌కు, వేదిక‌: మియామి స్టేడియం

👉అర్జెంటీనా వ‌ర్సెస్ స్విట్జ‌ర్లాండ్‌, జూలై 12, ఉద‌యం 6.30 గంట‌ల‌కు, వేదిక‌: కాన్సాస్ సిటీ

క్వార్టర్ ఫైన‌ల్లో గెలిచిన నాలుగు జ‌ట్లు జూలై 15, 16వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న సెమీఫైన‌ల్స్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక‌ ప్రతిష్టాత్మక ఫిఫా ఫైన‌ల్ జూలై 19 (ఆదివారం) తెల్ల‌వారుజామున 2.30 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది.

Read: టీమిండియాకు ఆర్చర్‌ చుర‌క‌లు.. ‘వైభ‌వ్‌కు ఇదే నా స‌వాల్‌’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement