భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సత్యన్ జ్ఞానశేఖరన్ ‘డబ్ల్యూటీటీ’ ఫీడర్ సిరీస్‌లో టైటిల్ సాధించిన తొలి భారత ఆటగాడిగా ఘనతకెక్కాడు. లెబనాన్‌లోని బీరుట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం అర్ధరాత్రి ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్యే టైటిల్ పోరు జరిగింది. ఈ టోర్నీలో 11వ సీడ్‌గా బరిలోకి దిగిన సత్యన్ 3–1 (6–11, 11–7, 11–7, 11–4)తో సహచరుడు, తొమ్మిదో సీడ్ మానవ్ ఠక్కర్‌పై విజయం సాధించాడు.
దాదాపు మూడేళ్ల తర్వాత సత్యన్ అంతర్జాతీయ ర్యాంకింగ్ ఈవెంట్‌లో విజేతగా నిలిచాడు. 2021 ఆగస్టులో జరిగిన ఐటీటీఎఫ్ చెక్ ఇంటర్నేషనల్ ఓపెన్‌లో అతను టైటిల్ గెలిచాడు. మరో వైపు భారత జోడీల మధ్యే జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో దియా చిటాలే–మానుష్ షా ద్వయం విజేతగా నిలిచింది. టైటిల్ పోరులో దియా– మానుష్ 3–1 (11–6, 10–12, 11–6, 11–6)తో అర్చన కామత్–మానవ్ ఠక్కర్‌లపై గెలుపొందారు. పురుషుల డబుల్స్ తుది పోరులో మానవ్ ఠక్కర్–మానుష్ జంట రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment