Sathyan.
-
ప్రియాంక ప్రత్యర్థి సత్యన్ మొకెరి
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీపై పోటీకి వామపక్ష ఎల్డీఎఫ్ సత్యన్ మొకెరిని ఎంపిక చేసింది. సీపీఐకి చెందిన మొకెరి కొజికోడ్ జిల్లాలోని నాదపురం మాజీ ఎమ్మెల్యే. వ్యవసాయ రంగానికి చెందిన సమస్యలపై పనిచేసిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. వయనాడ్‌లో సత్యన్ మొకెరి ఎల్డీఎఫ్ అభ్యర్థిగా ఉంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వమ్ గురువారం ప్రకటించారు. మొకెరి 2014 వయనాడ్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఐ.షానవాజ్ చేతిలో దాదాపు 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచి రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచి్చన విషయం తెలిసిందే. నవంబరు 13న వయనాడ్‌లో పోలింగ్ జరగనుంది. -
సత్యన్‌కు తొలి డబ్ల్యూటీటీ టైటిల్
భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సత్యన్ జ్ఞానశేఖరన్ ‘డబ్ల్యూటీటీ’ ఫీడర్ సిరీస్‌లో టైటిల్ సాధించిన తొలి భారత ఆటగాడిగా ఘనతకెక్కాడు. లెబనాన్‌లోని బీరుట్లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం అర్ధరాత్రి ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్యే టైటిల్ పోరు జరిగింది. ఈ టోర్నీలో 11వ సీడ్‌గా బరిలోకి దిగిన సత్యన్ 3–1 (6–11, 11–7, 11–7, 11–4)తో సహచరుడు, తొమ్మిదో సీడ్ మానవ్ ఠక్కర్‌పై విజయం సాధించాడు. దాదాపు మూడేళ్ల తర్వాత సత్యన్ అంతర్జాతీయ ర్యాంకింగ్ ఈవెంట్లో విజేతగా నిలిచాడు. 2021 ఆగస్టులో జరిగిన ఐటీటీఎఫ్ చెక్ ఇంటర్నేషనల్ ఓపెన్‌లో అతను టైటిల్ గెలిచాడు. మరో వైపు భారత జోడీల మధ్యే జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో దియా చిటాలే–మానుష్ షా ద్వయం విజేతగా నిలిచింది. టైటిల్ పోరులో దియా– మానుష్ 3–1 (11–6, 10–12, 11–6, 11–6)తో అర్చన కామత్–మానవ్ ఠక్కర్‌లపై గెలుపొందారు. పురుషుల డబుల్స్ తుది పోరులో మానవ్ ఠక్కర్–మానుష్ జంట రన్నరప్‌తో సరిపెట్టుకుంది. -
మనిక–సత్యన్ జోడీకి టైటిల్
బుడాపెస్ట్ (హంగేరి): టోక్యో ఒలింపిక్స్‌లో ఎదురైన నిరాశ నుంచి భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు మనిక బాత్రా, సత్యన్ త్వరగానే బయటపడ్డారు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో జోడీ కట్టిన మనిక–సత్యన్ మిక్స్డ్ డబుల్స్‌లో టైటిల్ చేజిక్కించుకున్నా. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత జోడీ 3–1 (11–9, 9–11, 12–10, 11–6)తో ఆతిథ్య హంగేరీకి చెందిన 94వ ర్యాంక్ డోర మదరస్జ్–నండోర్ ఎక్సెకీ జంటపై గెలుపొందింది. సింగిల్స్ సెమీస్‌లో అవుట్ మిక్స్డ్ డబుల్స్‌లో విజయవంతమైన మనిక సింగిల్స్‌లో నిరాశపరిచింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 60వ ర్యాంకర్ మనిక బాత్రా 0–4 (10–12, 9–11, 10–12, 8–11)తో ఎలిజబెత్ అబ్రామియెన్ (రష్యా) చేతిలో కంగుతిన్నది. ఏకంగా 415వ ర్యాంకర్ చేతిలో అది కూడా ఒక్క గేమ్ కూడా గెలవకుండా మనిక పరాజయం చవిచూడటం గమనార్హం. పురుషుల సింగిల్స్‌లో సత్యన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. -
ప్రపంచకప్‌కు సత్యన్
యొకోహామా: భారత నంబర్‌వన్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు సత్యన్ ప్రపంచకప్ టీటీకి అర్హత సంపాదించాడు. ఇక్కడ జరిగిన ఐటీటీఎఫ్–ఏటీటీయూ ఆసియా కప్‌లో అతను ఆరో స్థానం పొందడం ద్వారా ప్రపంచకప్ బెర్త్ లభించింది. ఆదివారం ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో 26 ఏళ్ల సత్యన్ 4–11, 8–11, 8–11, 12–14తో చైనీస్ తైపీకి చెందిన లిన్ యున్ జు చేతిలో పరాజయం చవిచూశాడు. అయితే ఈ ఓటమి అతని అవకాశాలను దెబ్బ తీయలేదు. ప్రపంచ 28వ ర్యాంకర్ అయిన సత్యన్ టోర్నీలో మెరుగైన స్థానం (టాప్–6)తో ఈ ఏడాది చైనాలో జరిగే మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాడు. ఈ టోర్నీ అక్టోబర్ 18 నుంచి 20 వరకు చెంగ్డూలో జరుగుతుంది. -
ప్రపంచ కప్‌కు చేరువైన సత్యన్
యొకోహామా: భారత నంబర్‌వన్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు జి.సత్యన్ ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు కేవలం అడుగు దూరంలో ఉన్నాడు. ‘ఐటీటీఎఫ్–ఏటీటీయూ’ ఆసియా కప్‌లో సత్యన్... ప్రపంచ 14వ ర్యాంకర్ చున్ టింగ్ వాంగ్ (హాంకాంగ్)కు షాకిచ్చాడు. శనివారం 5–8 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో సత్యన్ 12–10, 10–12, 11–5, 11–6, 11–8తో హాంకాంగ్‌కు చెందిన నంబర్‌వన్ ఆటగాడిని కంగుతినిపించాడు. దీంతో భారత ఆటగాడు ఇప్పుడు 5వ స్థానం కోసం లిన్ యున్ జు (చైనీస్ తైపీ)తో తలపడతాడు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో అతను గెలిస్తే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాడు. శనివారం ముందుగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో అతనికి నిరాశ ఎదురైంది. అతను 5–11, 5–11, 11–6, 6–11, 3–11తో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ మ లాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
సత్యన్ కొత్త చరిత్ర
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున ఆల్‌టైమ్ బెస్ట్ ర్యాంక్ సాధించిన క్రీడాకారుడిగా జ్ఞానశేఖరన్ సత్యన్ చరిత్ర సృష్టించాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సత్యన్ మూడు స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంక్ సాధించిన ప్లేయర్‌గా ఆచంట శరత్ కమల్ (30వ ర్యాంక్) పేరిట ఉన్న రికార్డును సత్యన్ సవరించాడు. గత ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న శరత్ కమల్ మూడు స్థానాలు పడిపోయి 33వ ర్యాంక్‌కు చేరాడు. తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల సత్యన్ ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో సత్యన్ టీమ్ విభాగంలో స్వర్ణం, మిక్స్డ్ డబుల్స్‌లో కాంస్యం, పురుషుల డబుల్స్‌లో రజతం సాధించాడు. ఆస్ట్రియా ఓపెన్ వరల్డ్ టూర్ ప్లాటినమ్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌లో మనిక బత్రా టాప్–50లోకి స్థానం పొందిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె పది స్థానాలు ఎగబాకి 47వ ర్యాంక్‌కు చేరుకుంది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో మనిక మహిళల సింగిల్స్, టీమ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది. -
ముగిసిన సత్యన్ పోరు
న్యూఢిల్లీ: ఆస్ట్రియా ఓపెన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ సత్యన్ జ్ఞానశేఖరన్ పోరాటం ముగిసింది. ప్రపంచ రెండో ర్యాంకర్ జు జిన్ (చైనా)తో శుక్రవారం లింజ్ నగరంలో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 35వ ర్యాంకర్ సత్యన్ 1–11, 7–11, 11–7, 2–11, 4–11తో ఓడిపోయాడు. అంతకుముందు తొలి రౌండ్లో సత్యన్ 4–11, 11–9, 11–9, 8–11, 6–11, 11–9, 11–7తో ప్రపంచ 16వ ర్యాంకర్ మార్కోస్ ఫ్రెటాస్ (పోర్చుగల్)పై సంచలన విజయం సాధించాడు. -
పురుషుల టీటీలో నయా చరిత్ర
ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత పురుషుల జట్టు చరిత్రాత్మక గెలుపుతో రికార్డు పుస్తకాలకెక్కింది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సత్యన్ జ్ఞానశేఖరన్, ఆచంట శరత్ కమల్, హర్మీత్ దేశాయ్,ఆంథోనీ అమల్‌రాజ్‌లతో కూడిన భారత జట్టు 3–1తో ప్రపంచ రెండో ర్యాంకర్ జపాన్‌పై సంచలన విజయం సాధించింది. 1958 ఏషియాడ్ నుంచి కనీసం ఒక్క పతకమైనా నెగ్గని భారత్ ఈసారి ఏకంగా సెమీఫైనల్స్‌కు చేరి కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది. క్వార్టర్స్ తొలి మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 11–9, 11–9, 11–7తో యుడా జిన్‌పై నెగ్గి శుభారంభం అందించగా... రెండో మ్యాచ్‌లో శరత్ కమల్ 11–8, 12–10, 11–8తో మసుదైరా కెంటాను మట్టికరిపించి ఆధిక్యాన్ని 2–0కు పెంచాడు. మూడో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 11–9, 12–14, 11–8, 8–11, 4–11తో యొషిడా మసాకి చేతిలో ఓడిపోయాడు. అయితే నాలుగో మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ విజృంభించి 12–10, 6–11, 11–7, 11–4తో కెంటాను ఓడించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. మంగళవారం జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్; చైనీస్ తైపీతో చైనా తలపడతాయి. సెమీస్‌లో ఓడిన జట్లకు కాంస్యాలు లభిస్తాయి. మరోవైపు భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో 1–3తో హాంకాంగ్ చేతిలో ఓడిపోయింది. -
రాజా రాణి మూవీ స్టిల్స్