
యొకోహామా: భారత నంబర్‌వన్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు జి.సత్యన్ ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు కేవలం అడుగు దూరంలో ఉన్నాడు. ‘ఐటీటీఎఫ్–ఏటీటీయూ’ ఆసియా కప్‌లో సత్యన్... ప్రపంచ 14వ ర్యాంకర్ చున్ టింగ్ వాంగ్ (హాంకాంగ్)కు షాకిచ్చాడు. శనివారం 5–8 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో సత్యన్ 12–10, 10–12, 11–5, 11–6, 11–8తో హాంకాంగ్‌కు చెందిన నంబర్‌వన్ ఆటగాడిని కంగుతినిపించాడు. దీంతో భారత ఆటగాడు ఇప్పుడు 5వ స్థానం కోసం లిన్ యున్ జు (చైనీస్ తైపీ)తో తలపడతాడు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో అతను గెలిస్తే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాడు. శనివారం ముందుగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో అతనికి నిరాశ ఎదురైంది. అతను 5–11, 5–11, 11–6, 6–11, 3–11తో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ మ లాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment